Minister Nara Lokesh Praja Darbar: ప్రజల విన్నపాలపై ప్రతి వారం సమీక్ష చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ నిర్ణయించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో 19వ రోజు ప్రజాదర్బార్ జోరు వానలోనూ కొనసాగింది. మంత్రి లోకేశ్‌కు ప్రజలు సమస్యలు విన్నవించుకున్నారు. శాఖల వారీగా విభజించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ప్రజల అర్జీలు ఎంతమేరకు పరిష్కారమయ్యాయో ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
డ్రాప్ ఔట్ విద్యార్థులకు బోధన అందించే తమను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని పలువురు ఉపాధ్యాయులు లోకేశ్‌కు వినతి ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలలో పని చేస్తున్న 27వేల మంది కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి కృష్ణనగర్ అంగన్వాడీ పాఠశాలకు స్థలం కేటాయించడంతోపాటు శాశ్వత భవనం నిర్మించాలని డి. లీల విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకశ్ భరోసా ఇచ్చారు.
ఆళ్ల నాని పరిహారం అందకుండా చేశారు - మంత్రి లోకేశ్‌కు బాధితుడి మొర - Lokesh Praja Darbar 17th Day
హామీని నెరవేర్చినందుకు మంత్రి లోకేశ్‌కు మహిళ కృతజ్ఞతలు: యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సమస్యను పరిష్కరించిన మంత్రి నారా లోకేశ్‌కు ఏలూరు మహిళ కృతజ్ఞతలు తెలిపారు. తమ ఇంటిని వైఎస్సార్సీపీ నేతలు కబ్జా చేశారంటూ యువగళంలో భాగంగా ఏలూరు వచ్చినప్పుడు లోకేశ్‌కు అనూష అనే యువతి తమ సమస్యను విన్నవించుకున్నారు. అధికారంలోకి రాగానే ఇంటిని కబ్జా నుంచి విడిపిస్తానంటూ అప్పట్లో లోకేశ్ హామీ ఇచ్చారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జూన్ 17న అనూష మంత్రి లోకేశ్‌ను ప్రజాదర్బార్‌లో కలిశారు. అనూషను చూసి గుర్తుపట్టిన ఆయన సమస్య పరిష్కారం అవుతుందని ధైర్యం చెప్పారు. ప్రజాదర్బార్‌లో నమోదైన ఫిర్యాదుపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, అధికార యంత్రాంగం స్పందించడంతో అనూషకు నెల రోజుల్లోపే తన ఇల్లు దక్కింది. ఈ సందర్భంగా అనూష, ఆమె తల్లి ఉండవల్లి వచ్చి మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఏయూ వీసీని అభినందించిన మంత్రి లోకేశ్: వైఎస్సార్సీపీ హయాంలో వీసీ ఛాంబర్, పరిపాలన భవనంలోకి రాకుండా వేయించిన ఇనుప కంచెలను తొలగించిన ఆంధ్రా యూనివర్సిటీ ఇంఛార్జి, వైస్ ఛాన్సలర్ శశిభూషణ్‌ను మంత్రి లోకేశ్ అభినందించారు. అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండాలన్నారు. అలా ఉన్నప్పుడే విశ్వవిద్యాలయాలు విద్యా, విజ్ఞాన, వికాస కేంద్రాలుగా నిలుస్తాయని ఆయన అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక విశ్వవిద్యాలయాల్లోనూ నిజమైన మార్పు ప్రారంభమైందని లోకేశ్ పేర్కొన్నారు.
కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటున్న నారా లోకేశ్ - ప్రజాదర్బార్‌కు పోటెత్తిన జనం - Minister Nara Lokesh Praja Darbar