ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

"రెడ్​బుక్"​ ఇంకా తెరవలేదు- తెరిస్తే ఏమవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా: మంత్రి లోకేశ్ - NARA LOKESH RED BOOK - NARA LOKESH RED BOOK

Minister Nara Lokesh on Red Book: రెడ్‌బుక్‌ తెరవకముందే జగన్‌ దిల్లీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం ఎద్దేవా చేశారు. తప్పు చేసిన వారందరి పేర్లూ రెడ్‌బుక్‌లో చేర్చి చట్టప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రెడ్‌బుక్‌కు మాత్రం జాతీయ మీడియాను బతిమాలి పిలిపించి ప్రచారం కల్పించారని అన్నారు.

nara_lokesh_on_red_book
nara_lokesh_on_red_book (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 5:44 PM IST

Minister Nara Lokesh on Red Book:తప్పు చేసిన వారందరి పేర్లు రెడ్​బుక్​లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నానని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఇంకా రెడ్​బుక్ తెరవక ముందే జగన్ దిల్లీకి వెళ్లి గగ్గోలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. పీవీ నరసింహారావుకు భారతరత్నపై స్పందించమని జగన్‌రెడ్డిని జాతీయ మీడియా కోరితే విజయసాయి పేరు చెప్పి వెళ్లిపోయారని మండిపడ్డారు. రెడ్​బుక్​కు మాత్రం జాతీయ మీడియా వెంటపడి బతిమాలి పిలిపించి మరీ ప్రచారం కల్పించారని అన్నారు.

గత 5 ఏళ్ల కాలంలో జగన్ 2 ప్రెస్మీట్​లు పెడితే 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో 5 ప్రెస్మీట్​లు పెట్టారని విమర్శించారు. జగన్ చెప్పే అబద్దాలేవో అసెంబ్లీకి వచ్చి చెప్తే వాస్తవాలను తాము వివరిస్తాం కదా అని నిలదీశారు. జగన్ అసెంబ్లీకి వస్తే గౌరవంగా చూసుకుని వాస్తవాలు అర్ధమయ్యేలా వివరిస్తామన్నారు. వైఎస్సార్​సీపీ నేతల్లా కూటమి నేతలెవ్వరూ బూతలు తిట్టరు, జగన్ కుటుంబసభ్యుల్ని అగౌరవపరచరని తెలిపారు. అసెంబ్లీ చివరి రోజు కావటంతో నారా లోకేశ్​కు వినతులు వెల్లువెత్తాయి. పలువురు నామినేటెడ్ పదవుల ఆశావహులు ఆయనని కలిసి తమ తమ బయోడేటాలు అందచేశారు. పార్టీ కోసం కష్టపడిన వారి సేవల్ని గుర్తుపెట్టుకుని అందరికీ న్యాయం చేస్తానని లోకేశ్‌ హామీ ఇచ్చారు.

వరద బాధితులను ఆదుకుంటాం- పంట నష్టాన్ని అంచనా వేయాలని చంద్రబాబు ఆదేశాలు - Chandrababu on Floods in AP

Srikalahasti MLA Bojjala Sudhir Reddy:లోకేశ్‌ దగ్గర రెడ్​బుక్ ఉందని ఆయనే చెప్తే ఇక జగన్ చెప్పేదేంటని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిలదీశారు. రెడ్​బుక్​లో మొదటి పేరు జగన్‌ దేనని ఆయన తెలిపారు. లోకేశ్‌ రెడ్​బుక్ గురించి జగన్ దిల్లీలో కూడా చెప్పటం హాస్యాస్పదమన్నారు. మదనపల్లిలో ఫైల్స్ తగలపెట్టిన కేసులో పెద్దిరెడ్డి తప్ప ఎవరినీ వదలమని సుధీర్‌రెడ్డి హెచ్చరించారు.

అసెంబ్లీకి రావాలి జగన్ కావాలి జగన్: జగన్‌ అసెంబ్లీకి రాకుండా దిల్లీలో చిత్ర విచిత్ర విన్యాసాలు చేశారని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దుయ్యబట్టారు. వైఎస్సార్​సీపీ హయాంలో క్రైం క్యాపిటల్‌, గంజాయి క్యాపిటల్‌గా మారిన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు కృషిచేస్తున్నామని అన్నారు. జగన్‌ ఇకనైనా అసెంబ్లీకి రావాలని కోరారు. అసెంబ్లీకి రావాలి జగన్ కావాలి జగన్ అన్నదే తమ నినాదంగా పేర్కొన్నారు. కేసులు ఎంతమంది మీద ఉన్నాయని నిన్న సీఎం అడిగితే నిలబడిన ఎమ్మెల్యేల కళ్లన్నీ జగన్ అసెంబ్లీ రాక కోసం వేచి చూస్తున్నారని ఆదిరెడ్డి వాసు తెలిపారు.

MLA GV Anjaneyu:శవం కనిపిస్తే రాబందు కంటే హీనంగా జగన్ ప్రవర్తన ఉందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. జగన్​కు దమ్ముంటే రాజకీయ హత్యలకు సంబంధించిన మూడు వివరాలైనా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తన కుంటుంబ సభ్యుల గురించి జగన్ అసత్యాలు చెప్తున్నాడని ధ్వజమెత్తారు. ఇద్దరు రౌడీలు గొడవ పడితే దిల్లీ వెళ్లి గొడవ చేస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయ్ హత్య నిందితులు జగన్ భార్యతో ఫోటోలు దిగలేదా అని నిలదీశారు. జగన్​తో ఫోటోలు దిగిన వారంతా వివిధ కేసుల్లో నిందితులేనని ఈలెక్కన జగన్​పై ఎన్ని కేసులు పెట్టాలని ప్రశ్నించారు.

మంత్రి లోకేశ్​ను కలిసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం- టీడీపీలో చేరిక లాంఛనమే!

గాంధీ ఫొటో పెట్టుకుని గ్రామాలను నాశనం చేశారు- పంచాయతీల సొమ్ము డిస్కంలకు మళ్లించారు : మంత్రి పవన్​ - PAWAN KALYAN speech in assembly

ABOUT THE AUTHOR

...view details