ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

కాసేపట్లో పవన్‌కల్యాణ్‌ నామినేషన్‌ - పిఠాపురంలో భారీ ర్యాలీ - Pawan Kalyan Nomination With Rally - PAWAN KALYAN NOMINATION WITH RALLY

Janasena Chief Pawan Kalyan Nomination With a Huge Rally At Pithapuram: జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కాసేపట్లో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయల్దేరారు. ప్రత్యేక కాన్వాయ్‌లో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లనున్న పవన్‌ ఎన్నికల అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేయనున్నారు.

Janasena Chief Pawan Kalyan Nomination With a Huge Rally At Pithapuram
Janasena Chief Pawan Kalyan Nomination With a Huge Rally At Pithapuram

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 11:02 AM IST

Janasena Chief Pawan Kalyan Nomination With a Huge Rally At Pithapuram :జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ కాసేపట్లో నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ఆయన బయల్దేరారు. పవన్‌కల్యాణ్‌ నామినేషన్‌ సందర్భంగా జనసేన, తెలుగుదేశం, భాజపా శ్రేణులతో భారీ జనసందోహం నడుమ జనసేనాని ర్యాలీ కొనసాగుతోంది. చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకు ర్యాలీ కొనసాగనుంది.

అనంతరం అక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లనున్న పవన్‌ ఎన్నికల అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేయనున్నారు. నామినేషన్‌ ర్యాలీలో భారీగా అభిమానులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్‌ జాతీయ జెండా పట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తుండగా ర్యాలీ ముందుకు సాగింది. సాయంత్రం ఉప్పాడలో నిర్వహించనున్న బహిరంగసభలో పవన్‌ పాల్గొంటారు.

కాసేపట్లో పవన్‌కల్యాణ్‌ నామినేషన్‌ - పిఠాపురంలో భారీ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details