Heritage Letter to CID : తమ సంస్థకు చెందిన పత్రాల దహనంపై ఆందోళన వ్యక్తం చేస్తూ సీఐడీకి హెరిటేజ్ లేఖ రాసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించిన కీలక పత్రాలు సీఐడీ అభ్యర్థన మేరకు ఇచ్చామని లేఖలో పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించి, కేసు విచారణలో సీఐడీకి సహకరించేందుకు ఎంతో నమ్మకంతో ఇచ్చిన కీలక పత్రాలు ఇలా దహనం చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చూసి కలత చెందామన్నారు. న్యాయ ప్రక్రియలో భాగంగా ఇచ్చిన పత్రాలపై గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత సీఐడీపై ఉందని అన్నారు.
ఎంతో నమ్మకంతో ఇస్తే దహనం చేస్తారా ? - పత్రాల భద్రతపై హెరిటేజ్ ఆందోళన ఐఆర్ఆర్ కేసులో సీఐడీ చార్జిషీట్ - సీల్డ్ కవర్లో ఏసీబీ కోర్టుకు అందజేత
తమ కీలక పత్రాల భద్రత, గోప్యతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. హెరిటేజ్ సంస్థ సీఐడీకి ఇచ్చిన కీలక పత్రాల తాజా స్థితిగతులపై తమకు వివరణ ఇవ్వాలని కోరారు. వాటికి సంబంధించిన వీడియోలు కూడా తమకు ఇవ్వాలని అన్నారు. అప్పుడే పత్రాలు సురక్షితంగా నిల్వ చేయబడి, సీఐడీ రక్షణలో ఉన్నాయని తాము నమ్ముతామన్నారు. తాజా పరిణామాలపై సీఐడి సమాధానం కోసం ఎదురు చూస్తున్నామని హెరిటేజ్ లేఖలో పేర్కొంది.
చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు- అసైన్డ్ భూముల కేసులో ఛార్జిషీట్
తాడేపల్లిలోని పాతూరు రోడ్డు సంవృద్ధి నెక్సా అపార్ట్మెంట్ లో సీఐడీ సిట్ కార్యాలయాన్ని 5ఫ్లోర్లలో ఏర్పాటు చేశారు. గేటెడ్ కమ్యూనిటీకి చెందిన ఈ అపార్ట్ మెంట్ లో 200కు పైగా సాధారణ కుటుంబాలు నివాసం ఉండగా సీఐడీ అదనపు డీజీ కొల్లి రఘురామరెడ్డి కూడా అందులోనే నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం 10గంటల సమయంలో కొల్లి రఘురామరెడ్డి సిబ్బంది ఓ సంచి నిండా పలు దస్త్రాలను అపార్ట్మెంట్ ప్రాంగణంలో పడేశారు. అనంతరం వాటిని తగులబెట్టడాన్ని అపార్ట్మెంట్ లో ఉన్న పలు కుటుంబాలు గమనించి ప్రశ్నించాయి. చంద్రబాబు, హెరిటేజ్ కి సంబంధించిన దస్త్రాలు మా పెద్ద బాస్ తగలపెట్టమంటే పెడుతున్నట్లు చెప్పిన సదరు వ్యక్తి .. పూర్తిగా తగలపెట్టిన సాక్ష్యాన్ని కూడా వీడియో రూపంలో తమ పెద్ద బాస్ పంపేందుకు చిత్రీకరిస్తున్నానని సమాధానం ఇచ్చాడు. వెంటనే జరుగుతున్న ఘటనపై అనుమానం వచ్చిన స్థానికులు సమీపంలో ఉన్న తెలుగుదేశం నాయకులకు సమాచారం ఇవ్వగా వారంతా అక్కడికి చేరుకుని సెల్ఫోన్లలో చిత్రీకరించారు. ఈ క్రమంలో జరుగుతున్న పరిణామాలపై అనుమానం వ్యక్తమవటంతో వీడియోలు తీయొద్దంటూ సీఐడీ సిబ్బంది బెదిరింపులకు దిగారు. ఆ వీడియోలు ఫోన్లలో నుంచి తొలగించాలని, తమకు ఇవ్వాలని బెదిరించారు.
తనపై ఉన్న కేసుల వివరాలివ్వాలని కోరుతూ డీజీపీకి చంద్రబాబు లేఖ