Final Candidates List for AP Elections:సార్వత్రిక ఎన్నికల సమరంలో రాష్ట్రంలోని 175 శాసన సభ స్థానాల్లో 2,387 మంది 25 లోక్‌సభ నియోజవర్గాల్లో 454 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో 318 మంది, లోక్‌సభ స్థానాల్లో 49 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి అత్యధికంగా 10, బాపట్ల శాసనసభకు 11 మంది నామినేషన్లు వెనక్కు తీసుకున్నారు. శాసనసభకు అత్యధికంగా తిరుపతిలో 46 మంది, మంగళగిరిలో 40 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. లోక్‌సభ స్థానాల్లో విశాఖలో అత్యధికంగా 33 మంది, నంద్యాలలో 31 మంది, గుంటూరులో 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
విశాఖ లోక్సభకు 33 మంది - తిరుపతి అసెంబ్లీకి 46 మంది బరిలో - Ap Elections Final Candidates List
Final Candidates List for AP Elections: రాష్ట్రంలో ఎన్నికల ఎన్నికల ఉపసంహరణ గడువు పూర్తవటంతో బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. 175 శాసన సభ స్థానాల్లో 2,387 మంది 25 లోక్‌సభ నియోజవర్గాల్లో 454 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
Final_Candidates_List_for_AP_Elections
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 1, 2024, 9:41 AM IST
13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. ఎస్టీ నియోజకవర్గాలైన పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ, అరకు పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకూ మాత్రమే పోలింగ్ జరుగుతుందని స్పష్టం చేసింది.