YCPleaders joining TDP: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ గోపవరం వెంకటరమణమ్మ వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మాజీ మంత్రి ఆత్మకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సర్దార్, మరియు కౌన్సిలర్లు రమాదేవి గారు, వేణు గారు, సూర భాస్కర్ రెడ్డి గారు, కొత్తపల్లి రమేష్ , తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు చంద్రారెడ్డి, చల్లా రవి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగం వదులుకొని గ్రామాభివృద్ధి కోసం వైసీపీలో చేరి ప్రకాశ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే వీధిలైట్లు కూడా వేయించుకోలేకపోయామని ఉప మండలాక్షుడు సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండల వైసీపీ ఉప ఎంపీపీ సంపత్ కుమార్, వైసీపీ నాయకుడు రామాంజనేయులుతో పాటు 20 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. మాజీ మంత్రి పరిటాల సునీత సమక్షంలో వెంకటాపురంలో టీడీపీలోకి వచ్చిన వైసీపీ నాయకులకు ఆమె టీడీపీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉప ఎంపీపీ సంపత్ కుమార్ మాట్లాడుతూ ఉన్నతంగా చదువుకొని, ఉద్యోగం వదిలి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోటానికి వైసీపీలో చేరానన్నారు. తాము కష్టపడి ఎమ్మెల్యేగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని గెలిపించుకుంటే, గ్రామంలో వీధిలైట్లు కూడా వేయించుకోలేక పోయినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని పరిస్థితితో వైసీపీ ను వీడి టీడీపీలో చేరినట్లు చెప్పారు.