CM on Co-Working Spaces and Neighborhood Work Spaces :చదువుకున్న మహిళలు గృహిణులుగా ఇళ్లలో మిగిలిపోకూడదని సీఎం చంద్రబాబు అన్నారు. కో-వర్కింగ్ స్పేస్, వర్క్ ఫ్రం హోంతో మానవవనరుల సమర్థ వినియోగం జరుగుతుందన్నారు. వీటి ద్వారా మహిళలకు ఉపాధి మార్గాలు అన్వేషించి అన్ని అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కో-వర్కింగ్ స్పేస్, నైబర్ హుడ్ వర్కింగ్ స్పేస్‌ల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గ్రామాలు, చిన్న పట్టణాల్లో ఉన్న వారికి ట్రైనింగ్ ఇచ్చి అవకాశాలు కల్పించాలని వారి కోసం వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేయాలని సూచించారు. వర్క్ ఫ్రం హోమ్, కో-వర్కింగ్ సెంటర్‌లతో మహిళలకు విస్తృతంగా అవకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటికీ చదువుకున్న మహిళలు ఇళ్లల్లో ఉంటున్నారని వారికి వర్క్ ఫ్రం హోమ్ అందుబాటులోకి తెస్తే ఆన్లైన్ విధానంలో పని చేసి ఉపాధి పొందుతారన్నారు. మహిళల్లో ఎంతో సమర్థత, నైపుణ్యం ఉందని కుటుంబ వ్యవహారాలు, బాధ్యతల వల్ల చాలా మంది ఇళ్లకే పరిమితం అవుతున్నారని వారికి అవకాశాలు కల్పిస్తే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని సీఎం న్నారు.
సీఎం రేవంత్‌ను కలిశా - అల్లు అర్జున్ను కలుస్తాను - ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తా: దిల్ రాజు
ఈ వర్కింగ్ సెంటర్లు: కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ల ఏర్పాటులో 2025 డిసెంబర్ చివరినాటికి లక్షన్నర సీట్లు అందుబాటులోకి తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ఒక్కో సీటుకు 50 నుంచి 60 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరమని ప్రభుత్వ, ప్రైవేటు భవనాల్లో ఈ వర్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ప్రైవేటు, ప్రభుత్వ భవనాల్లో 22 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గుర్తించామని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎంత మంది వర్క్ ఫ్రం హోమ్‌లో పని చేస్తున్నారు, వారి అవసరాలు ఏంటనే సమాచారం సేకరించాలని సీఎం సూచించారు.
రతన్ టాటా ఇన్నో వేషన్ హబ్‌ల ఏర్పాటుకు రాష్ట్రంలో 5 చోట్ల భవనాలను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ ప్రాంతంలోని పరిశ్రమలను, విద్యా సంస్థలను ఇన్నోవేషన్ హబ్‌లకు అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. ఏపీ మిషన్ కర్మయోగి కార్యక్రమంపై సీఎం సమీక్షించారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌తో ప్రభుత్వం అక్టోబర్ నెలలో ఒప్పందం చేసుకుంది. ఏపీ కెపాసిటీ బిల్డింగ్ పాలసీపై అధికారులతో సీఎం చర్చించారు. శిక్షణ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల నైపుణ్యాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది.
జగన్ అసమర్థత వల్ల రూ.450 కోట్ల అదనపు భారం : పెమ్మసాని చంద్రశేఖర్
పెట్టుబడి పెట్టి మోసపోయారా? - పలు కేసుల్లో నిందితులు మీరే కావొచ్చు! - అసలు విషయం తెలిస్తే షాకే