CM Chandrababu Fire on Minister TG Bharath :లోకేశ్ డిప్యూటీ సీఎం అంశంపై ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఆగ్రహంగా ఉంది. ఎవరికి నచ్చినట్లు వాళ్లు తమ సొంత అభిప్రాయాలను పార్టీ అభిప్రాయాలుగా చెప్పవద్దని ఆదేశాలు జారీ చేసింది. అయినా సరే కొంతమంది నేతల్లో మార్పు కనిపించడం లేదు. రాష్ట్రంలో అయితే సరి ఇతర దేశాలకు వెళ్లిన నేతలు సైతం ఇదేతీరును కనబరుస్తున్నారు. అదీ ఎక్కడో కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జూరీచ్లో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలోనే జరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు టీమ్ దావోస్ పర్యటనలో భాగంగా జ్యూరిచ్‌కు చేరుకున్నారు. అక్కడ తెలుగువారు చంద్రబాబు టీమ్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, రాష్ట్ర మంత్రులు లోకేశ్, టీజీ భరత్‌తో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో టీజీ భరత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా ఫ్యూచర్ ఈజ్ లోకేశ్ అండ్ ఫ్యూచర్లో కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ అంటూ భరత్ ప్రసంగించారు. ఇదంతా చంద్రబాబు సమక్షంలోనే జరిగింది.
దావోస్ పర్యటనలో మంత్రి టీజీ భరత్ ప్రసంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసదదర్భ ప్రసoగాలు వద్దు అంటూ మంత్రిని సీఎం మందలించారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావ్ అంటూ కార్యక్రమం అనంతరం భరత్‌పై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.