CM Chandrababu Discussion with Ministers: శాఖల పరంగా మంత్రుల పనితీరు మెరుగుపడాలని అందరు గేరు మార్చాలని సీఎం చంద్రబాబు చంద్రబాబు ఆదేశించారు. మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్ వివరాలను ఆయన మంత్రివర్గం సమావేశం అనంతరం చదివి వినిపించారు. దస్త్రాల క్లియరెన్స్‌లో తాను 6వ స్థానంలో ఉన్నానని చంద్రబాబు తెలిపారు. క్యాబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు కొద్దిసేపు మంత్రులతో మాట్లాడారు. మొదటి 6 నెలలు మంత్రుల పనితీరును అంతగా పట్టించుకోలేదన్న చంద్రబాబు ఇకపై ఎవరినీ ఉపేక్షించనని హెచ్చరించారు. ఆప్కోస్ ద్వారా కాకుండా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఇక శాఖల వారిగా తీసుకోవచ్చని సీఎం స్పష్టం చేశారు.
విద్యుత్ ఛార్జీలు తగ్గాలి:వివిధ పథకాల అమలుపై చేయిస్తున్న సర్వేల్లో సానుకూల స్పందన ఉందని సీఎం చెప్పారు. దావోస్ పర్యటన ఫలితం సానుకూలంగా ఉందని చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరగటానికి వీల్లేదని ఆయన తేల్చి చెప్పారు. సమగ్ర పవర్ మేనేజ్మెంట్తో రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు వీలైతే తగ్గాలే తప్ప పెరగటానికి వీల్లేదని తెలిపారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలను వేగవంతం చేసేలా కలెక్టర్లు, ఎస్ఈలకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా 7.5లక్షల ఉద్యోగాల హామీని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
వేసవి వస్తోంది ఏం చేద్దాం? - రికార్డు స్థాయిలో గ్రిడ్ పీక్ డిమాండ్