ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

బ్రాహ్మణుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంది-​ అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి : నారా లోకేశ్ - Brahmin Leaders Joined TDP

Brahmin Community Leaders Joined TDP in Presence of Nara Lokesh: బ్రాహ్మణుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని నారా లోకేశ్​ స్పష్టం చేశారు. ఉండవల్లిలోని 50 మంది బ్రాహ్మణ ప్రముఖులకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర బ్రాహ్మణ సాధికార కమిటీ అధ్యక్షులు బుచ్చిరామ్ ప్రసాద్ అధ్వర్యంలో వారు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.

brahmins_joined_tdp
brahmins_joined_tdp

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 16, 2024, 7:27 PM IST

Brahmin Community Leaders Joined TDP in Presence of Nara Lokesh:బ్రాహ్మణుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ పేర్కొన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో రాష్ట్ర బ్రాహ్మణ సాధికార కమిటీ అధ్యక్షులు బుచ్చిరామ్ ప్రసాద్ అధ్వర్యంలో 50 మంది బ్రాహ్మణ ప్రముఖులు లోకేశ్​ సమక్షంలో టీడీపీలో చేరారు. వారందరికీ లోకేశ్​ పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేశ్​ మాట్లాడుతూ దేశంలోనే మొదట 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది చంద్రబాబు అని గుర్తు చేశారు.

బ్రాహ్మణుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంది-​ అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి : నారా లోకేశ్

ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన జగన్‌కి హైకోర్టు తీర్పు చెంపపెట్టు: నారా లోకేశ్

గత టీడీపీ ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా 5 ఏళ్లలో బ్రాహ్మణుల సంక్షేమానికి 285 కోట్లు ఖర్చు చేసామన్నారు. గతంలో స్వయం ఉపాధికి నాలుగు లక్షల వరకూ 50 శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాల నిర్మాణానికి దేవాదాయ శాఖతో సంబంధం లేకుండా స్టేట్ బడ్జెట్ నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని అన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్​ని మరింత బలోపేతం చేస్తామని లోకేశ్​ హామీ ఇచ్చారు. బ్రాహ్మణులని పేదరికం నుంచి బయటకు తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు.

ప్రతీ ఎన్నికల ముందు నరబలి జరగాల్సిందేనా ?: నారా లోకేశ్

వేదం అభ్యసించి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్నవారికి నిరుద్యోగ భృతి అందిస్తామని పేర్కొన్నారు. బ్రాహ్మణ ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామన్నారు. బ్రాహ్మణ విద్యార్థుల ఉన్నత విద్యకు సహాయం చేస్తాం, విదేశీ విద్య పథకం తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. అర్చకులకు గుర్తింపు కార్డులు, గౌరవ వేతనం ఇస్తామని లోకేశ్​ హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన ప్రముఖుల్లో సత్యవాడ దుర్గాప్రసాద్ (రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య, ఏలూరు), యామిజాల నరసింహ మూర్తి,( అధ్యక్షులు, ఏపీ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య, విశ్రాంత డైరెక్టర్, ఏపీ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్, భీమవరం)

అందరి చూపు చిలకలూరిపేటవైపే - టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సభకు భారీ ఏర్పాట్లు

శ్రీశ్రీ శర్మ (వైస్ ప్రెసిడెంట్, ఆల్ ఇండియా బ్రాహ్మిన్ ఫెడరేషన్, ఏలూరు), కె. రామరాజు (రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం, కర్నూలు), ఏంబీ ఎస్. శర్మ (అఖిల భారత బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షులు), వై. సాయి సురేష్ (బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్), ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ (బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య జనరల్ సెక్రెటరీ), మరో 50 మంది బ్రాహ్మణులు, వివిధ సంఘాల్లో పనిచేసే ముఖ్యులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీ. జనార్ధన్, వేమూరి ఆనంద సూర్య, ఈమని సూర్య నారాయణ, గూడూరి శేఖర్, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details