POSTAL BALLOT : సర్వీసు ఓటర్లు వినియోగించుకున్న బ్యాలెట్ పత్రాల ధ్రువీకరణ లెక్కింపు రిటర్నింగ్ అధికారి టేబులైనే లెక్కిస్తారు. కౌంటింగ్ ప్రారంభమయ్యే సమయానికి ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు వస్తాయో వాటిని మాత్రమే లెక్కిస్తారు. అభ్యర్థులు ETPB (Electronically Transmitted Postal Ballot System) వారితో మాట్లాడి జూన్ 3వ తేదీలోగా బ్యాలెట్ రిటర్నింగ్ అధికారికి చేరేటట్లు చూసుకోవాలి. ముందు ఫారం 13C లోని కవర్ తెరుస్తారు. తరువాత ఒకదాని తర్వాత ఒకటి లెక్కిస్తారు. కవరు బయట ఉన్న QR. కోడ్ను స్కాన్ చేసి అవసరమైన చెకింగ్ జరుగుతుంది. రిటర్నింగ్ అధికారి సొంతంగా ఆ కవరుపై సీరియల్ నెంబరు వేస్తారు. QR కోడ్ చెకింగ్ వల్ల ఎటువంటి డూప్లికేట్ ఓట్లకు అవకాశం ఉండదు.
పోస్టల్ బ్యాలెట్ పత్రాల ధ్రువీకరణ- లెక్కింపు
పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు కోసం ప్రత్యేక టేబుల్ ఉంటుంది. ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపునకు ఒక అదనపు టేబుల్ ఏర్పాటు చేస్తారు. ఓటర్లు ఎన్నికల సంఘం అందజేసిన కవర్లు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. (వేరే కవర్లు ఉంటే ఆ పోస్టల్ బ్యాలెట్లు చెల్లనివిగా పరిగణిస్తారు)
మొదటి కవరు-బి పైన నియోజకవర్గం పేరు, ఎన్నికల అధికారి అడ్రస్, ఓటరు సంతకం ఉండాలి. (కవరు-బి పై ఓటరు సంతకం తప్పనిసరి కాదు)
మొదటి కవరు-బి (ఫారం 13C) తెరిచినప్పుడు, లోపల రెండు కవర్లు ఉండాలి. మొదటిది ఫారం 13A ఓటరు డిక్లరేషన్, రెండవది కవరు-ఏ లో ఉన్న పోస్టల్ బ్యాలెట్ పేపర్ (ఫారం 138), ఫారం 13A డిక్లరేషన్, ఫారం 138 (కవరు-ఏ) విడివిడిగా ఉండాలి. లేని పక్షంలో అది చెల్లుబాటు కాదు.
కవరు-సి లో ఉన్న పోస్టల్ బ్యాలెట్ పేపర్ (ఫారం 138) ను తెరువబోయే ముందు రిటర్నింగ్ అధికారి 13A (ఓటర్ డిక్లరేషన్ ఫారం) సరిచూసుకోవాలి.
1) కవరు ఏ లేకపోయినా,
2) ఫారం 13A (ఓటరు డిక్లరేషన్) లేకపోయినా,
3) డిక్లరేషన్ మీద ఓటరు సంతకం లేకపోయినా,
4) డిక్లరేషన్ మీద పోస్టల్ బ్యాలెట్ క్రమసంఖ్య నమోదు చేయకపోయినా, ఒకవేళ క్రమ సంఖ్య నమోదు చేసినట్లయితే...
ఆ క్రమ సంఖ్య ఫారం 138 (పోస్టల్ బ్యాలెట్ కవరు) మీద ఉన్న క్రమ సంఖ్య ఒకటే కాకపోయినా,
5) ఫారం 13A డిక్లరేషన్ మీద గజిటెడ్ అధికారి సంతకం (Altestation) లేకపోయినా, ఒకవేళ సంతకం ఉండి గజిటెడ్ అధికారి హోదా తెలియజేసే స్టాంప్ కానీ లేదా హెూదా తెలియజేసే విధంగా చేతితో రాసి కాని లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లనిదిగా పరిగణిస్తారు.
పోస్టల్ బ్యాలెట్ పరిశీలన...
ఫారం 13A డిక్లరేషన్లో అన్ని అంశాలు సరిగా ఉన్నట్లయితే, ఫారం 13B పోస్టల్ బ్యాలెట్ కలిగివున్న కవరు - ఏ ను పరిశీలించాలి.