APCC Chief YS Sharmila Fire on CM Jagan:రాష్ట్రంలో ఇవి న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కోనసీమ జిల్లా రావులపాలెంలో మాట్లాడిన ఆమె ఈ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బిడ్డ ఓడిందంటే నేరం గెలిచిందని అర్థమని పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. కుమారుడై ఉండి తండ్రి పేరును జగన్ దుర్మార్గంగా ఛార్జ్‌షీట్‌లో చేర్పించారని ధ్వజమెత్తారు.
పోలవరం నిర్వాసితులను జగన్ నమ్మించి ముంచారు: షర్మిల - YS Sharmila Public Meeting
సీబీఐ ఛార్జ్‌షీట్‌లో వైఎస్ పేరును కాంగ్రెస్ పార్టీ చేర్చలేదన్న ఆమె, ఆయన పేరు ఎఫ్‌ఐఆర్‌లో కూడా లేకపోతే ఇప్పుడు ఏఏజీగా ఉన్న సుధాకర్‌రెడ్డే చేర్పించారన్నారు. వైఎస్ పేరు లేకుంటే కేసు నుంచి జగన్ బయటపడటం అసాధ్యమనే ఉద్దేశంతోనే కేసు వేశారని ఆరోపించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు, సీబీఐ కోర్టుల్లో పిటిషన్లు వేయించారని, సుధాకర్‌రెడ్డి పిటిషన్ల మేరకే వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చిందని తెలిపారు. కన్నతండ్రి పేరును దుర్మార్గంగా జగనే ఛార్జ్‌షీట్‌లో చేర్పించారని ధ్వజమెత్తారు.
వైఎస్ పేరును ఛార్జిషీట్‌లో చేర్చినందునే జగన్ సీఎం అయిన 6 రోజుల్లోనే సుధాకర్‌రెడ్డికి ఏఏజీ పదవి కట్టబెట్టారని ఆరోపించారు. తండ్రి పేరును ఛార్జిషీట్ చేర్పించిన జగన్ దుర్మార్గం గురించి వైఎస్ అభిమానులు, ఆంధ్రా ప్రజలు ఆలోచించాలని వైఎస్ షర్మిల కోరారు. ఈ క్రమంలో గత ఐదేళ్లుగా జగన్ ఇంట్లో వాళ్ల చేతిలో, ప్రధాని మోదీ చేతిలో రిమోట్ కంట్రోల్‌గా ఉన్నారని షర్మిల మండిపడ్డారు.
ఇక్కడ మేనేజ్ చేసుకున్నా అక్కడ శిక్ష తప్పదు- వివేకా హత్యపై బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు - Brother Anil On Viveka murder
"ధర్మానికి, డబ్బుకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో చేర్చింది కాంగ్రెస్ కాదు. ఆయన పేరు ఎఫ్‌ఐఆర్‌లో కూడా లేకపోతే ప్రస్తుత ఏఏజీ సుధాకర్‌రెడ్డి చేర్పించారు. మూడు కోర్టుల్లో పిటిషన్లు వేయించారు. సుధాకర్‌రెడ్డి పిటిషన్ల మేరకే వైఎస్‌ఆర్ పేరును సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. వైఎస్ పేరు లేకుంటే కేసు నుంచి జగన్ బయటపడటం అసాధ్యమనే ఉద్దేశంతోనే కేసు వేశారు. కన్నతండ్రి పేరును దుర్మార్గంగా జగనే ఛార్జ్‌షీట్‌లో చేర్పించారు. కుమారుడై ఉండి కూడా తండ్రి పేరును చేర్పించారు. ఇలా ఎవరైనా చేస్తారా?ఎంత దుర్మార్గమిది. వైఎస్ పేరును ఛార్జిషీట్‌లో చేర్చినందునే జగన్ సీఎం అయిన 6 రోజుల్లోనే సుధాకర్‌రెడ్డికి ఏఏజీ పదవి కట్టబెట్టారు. దీనిపై వైఎస్ అభిమానులు, ఆంధ్రా ప్రజలు ఆలోచించాలి." - వైఎస్ షర్మిల, ఏపీసీసీ అధ్యక్షురాలు