Prathidwani :దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించేది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రే అయినా వెనక ఉండి వారిని నడిపించేది మాత్రం సివిల్ సర్వెంట్స్ అనబడే ఐఏఎస్, ఐపీఎస్లు. వీరిలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్లు గత ఐదేళ్లుగా తమ వృత్తికి కళంకం తీసుకుని వస్తున్నారు. తమ స్వీయ ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో చేతులు కలిపారు. చట్టాలను దారుణంగా ఉల్లంఘించారు. ప్రజా సంపదను దోచుకుంటున్న వైఎస్సార్సీపీ నాయకులకు అండగా నిలిచారు. ఎన్నికల ప్రక్రియను సైతం అపహాస్యం చేశారు. జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే వారిని చట్టవిరుద్ధంగా వెంటాడారు. అక్రమ కేసులు మోపి ఇబ్బందులు పెట్టారు. ప్రజలు ఆ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలోకి విసిరేయటంతో వారి గుండెల్లో రాయిపడింది. కొత్త ప్రభుత్వం కొలువుతీరే లోపు జంప్ అయిపోవాలని వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? చేసిన తప్పుల నుంచి తప్పించుకుని పోవటం సాధ్యమేనా? ఇదీ నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో ఏపీ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు, రాజకీయ విశ్లేషకులు ఏ. రాజేష్ పాల్గొన్నారు.
కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దలకు సాగిలపడిపోయి అధికార పార్టీ కార్యకర్తల్లా పని చేశారు. వైఎస్సార్సీపీ నాయకుల అవినీతికి, అక్రమ సంపాదనకు అండగా నిలుస్తూ యథేచ్ఛగా సాగిన వనరుల దోపిడీకి పూర్తిగా సహకరించారు. ప్రభుత్వ పెద్దల ప్రయోజనాల కోసం అడ్డగోలుగా వ్యవహరించి, నిబంధనలు తుంగలోతొక్కి న్యాయస్థానంలో దోషులుగానూ నిలబడ్డారు. మరి అంలాంటి అధికారులపై కొత్త ప్రభుత్వం కొలువుతీరాక ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.