Prathidwani Debate on CM YS Jagan Promises: జగనన్నకు ఉన్న కసి ఏంటో తెలుసా? ప్రజల మీద కసి. ప్రగతి మీద, పరిశ్రమల మీద, రాజధానిపై కసి. దళితులు, బడుగులపై కసి. కోర్టులు, ఎన్నికల సంఘం, మీడియా వంటి వ్యవస్థలపై కసి. ప్రతిపక్షాలపైన, ఇచ్చిన హామీలపై, ప్రజావేదికపై, అన్న క్యాంటిన్లపై కసి ఉందని అని ప్రజలు భావిస్తున్నారు. కానీ జగనన్న మాత్రం తనకి వేరే కసి ఉందని ప్రతిపక్షనేతగా చెప్పారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. అధికారం చేతికి వచ్చాక ఆ కసి ఎవరి మీద తీర్చుకున్నారో తెలుసుకుందాం. ఇదే నేటి ప్రతిధ్వని కార్యక్రమం. ఈ కార్యక్రమంలోని చర్చలో దళిత బహుజన్ ఫ్రంట్ నుంచి కె.వినయ్‌కుమార్, న్యాయవాది విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నసమయంలో సీఎం జగన్ చాలా మాటలు చెప్పారు. ప్రత్యేక హోదా తీసుకురావాలనే కసి తనలో ఉందని తెలిపారు. అదే విధంగా ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలని, రైతులకు వ్యవసాయం అంటే పండుగ అని చేసేందుకు కసి ఉందని అన్నారు. అదే విధంగా అధికారంలోకి వచ్చిన మూడు, నాలుగు సంవత్సరాలలో మద్యపానాన్ని నిషేధిస్తానని పేర్కొన్నారు. వీటితో పాటు అవినీతి అంతం, పేదరిక నిర్మూలన, పోలవరం పూర్తి ఇలా చాలానే చెప్పారు.
కూటమి చేతిలో జగన్ ఓటమి ఖాయమా?- అందుకే ప్రలోభాల పర్వం ప్రారంభించారా?
ప్రతిపక్షంలో ఉండగా అనేక ఆణిముత్యాల్లాంటి మాటలు చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక పూర్తి విరుద్ధంగా జగన్ వ్యవహారించారు. అమరావతిని విధ్వసం చేశారు. అన్న క్యాంటీన్లు మూసేసి పేదల నోటికాడ ముద్ద లాగేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితులు, బడుగులపై కసిగా దాడులు చేయించారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలపై దాడులు, కేసులతో రెచ్చిపోయారనే ఆరోపణలు ఉన్నాయి. అదే విధంగా పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారని చర్చలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడుతున్నారు. కోర్టులు, ఎన్నికల సంఘం, మీడియా వంటి వ్యవస్థలపై జగన్ తన ప్రతాపం చూపించారని మండిపడుతున్నారు.