ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

ధర తక్కువ ఫోన్లతో బుక్ చేస్తే తక్కువ ఛార్జీలు? - ఓలా, ఉబర్​కు కేంద్రం నోటీసులు - CAB FARES BASED ON PHONE MODEL

ఆండ్రాయిడ్ కంటే ఐఫోన్ కస్టమర్లు చెల్లిస్తున్నది ఎక్కువా? - ఓలా, ఉబర్ సంస్థలకు కేంద్రం నోటీసులు

cab_fares_based_on_phone_model_charging
cab_fares_based_on_phone_model_charging (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 12:42 PM IST

Cab Fares Based on Phone Model Charging :ఫోన్​లో బ్యాటరీ చార్జీంగ్ తక్కువగా ఉన్నపుడు ఎక్కువ చార్జీలు వేస్తున్నారని, అదే విధంగా తక్కువ రేటు ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ యూజర్లు ఎక్కువ చార్జీలు చెల్లించాల్సి వస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్యాబ్‌ సేవలు వినియోగించుకునే యూజర్ల ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్ ఆధారంగా వారి నుంచి ఉబెర్‌ అనే సంస్థ ఎక్కువ మొత్తంలో ఛార్జ్‌ చేస్తుందని బెల్జియం వార్తా సంస్థ ఆరోపించింది. సాధారణ చార్జీలకు మించి 6శాతం అదనంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించామని వెల్లడించింది.

క్యాబ్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికుల ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్ తక్కువగా ఉన్నపుడు ఉబెర్‌ ఎక్కువ మొత్తం వసూలు చేస్తోందని డెర్‌నియర్‌ హ్యూరే అనే వార్తా సంస్థ తన పరిశోధనలో గుర్తించినట్లు వెల్లడించింది. ఒకే ప్రాంతానికి రెండు వేర్వేరు ఉబెర్‌ క్యాబ్‌లను బుక్‌ చేసి నిరూపించడం గమనార్హం.

'పద్మ' అవార్డు గ్రహీతలకు ఎలాంటి ప్రయోజనాలు? - ప్రత్యేక ప్యాకేజీ ఉంటుందా?

ఒక ఫోన్‌ బ్యాటరీలో ఛార్జింగ్‌ 12 శాతం ఉండగా, మరో ఫోన్​లో 84 శాతం ఛార్జింగ్ ఉంది. క్యాబ్ రైడ్‌ ముగిసిన తర్వాత ఎక్కువ (84 శాతం) ఛార్జింగ్‌ ఫోన్‌ నుంచి 16.6 యూరోలు, తక్కువ (12 శాతం) ఛార్జింగ్ ఫోన్‌ కలిగిన వినియోగదారుడి నుంచి 17.56 యూరోలు వసూలు చేశారు. ఇదిలా ఉంటే ఈ బుకింగ్స్‌ను ఒకసారి ఐఫోన్‌తో, మరోసారి ఆండ్రాయిడ్‌ ఓఎస్ ఫోన్‌తో పరిశీలించినప్పుడు కూడా ఇదే విధమైన వ్యతాసం చూపించినట్లు వార్తా సంస్థ తెలిపింది.

కాగా, తమపై వచ్చిన ఆరోపణలను ఉబెర్‌ సంస్థ తోసిపుచ్చింది. వినియోగదారుడి ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ ఎంత ఉందనేది తెలుసుకోవడం సాధ్యం కాదని వివరణ ఇచ్చింది. రైడ్‌ బుక్‌ చేసుకునే సమయం, అందుబాటులో ఉన్న డ్రైవర్ల డిమాండ్‌ను ధరల్లో వ్యత్యాసం ఉంటుందని తెలిపింది. ఫోన్‌ బ్యాటరీ ఛార్జింగ్‌ ఆధారంగా ఫీజులు వసూలు చేయమని వివరించింది.

వినియోగదారులు తమ ఫోన్‌ బ్యాటరీ చార్జింగ్ తక్కువగా ఉన్నపుడు ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సుముఖంగా ఉన్నట్లు గుర్తించామని ఆ సంస్థ మాజీ ఆర్థిక విభాగాధిపతి కేత్ చెన్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ, తాము మాత్రం ఛార్జింగ్‌ ఆధారంగా రుసుము వసూలు చేయడంలేదని స్పష్టం చేశారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి ఆరోపణలపై సైబర్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత డేటా భద్రతకు భంగం కలుగుతుందని పేర్కొన్నారు.

యాప్‌ ఆధారంగా క్యాబ్‌ సర్వీసులు అందిస్తున్న ఉబర్‌, ఓలా సంస్థలపై ఫిర్యాదులు ఎక్కువ కావడంతో కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (సీసీపీఏ) చర్యలకు ఉపక్రమించింది. ఫోన్ మోడల్, బ్యాటరీ చార్జింగ్ ఆధారంగా ధరలు ఉంటున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో పూర్తి వివరణ ఇవ్వాలని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ అనే తేడా మాత్రమే కాకుండా ఫోన్‌ ధర ఆధారంగా కూడా సేవల్లో తేడా ఉంటోందని పలువురు సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో రైల్వేలైన్ లేని రాష్ట్రం - అక్కడి ప్రజలు ఆదాయ పన్ను కూడా చెల్లించరట!

మీ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి? - ఎవరెంత బరువుండాలో ఈ ఫార్ములాతో తెలుసుకోండి!

ABOUT THE AUTHOR

...view details