ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

విద్యార్థులు ఎంజాయ్​ - వరుసగా 3 రోజులు హాలీడేస్ ​- సెప్టెంబర్​లో భారీగా సెలవులు! - School Holidays in September - SCHOOL HOLIDAYS IN SEPTEMBER

School Holidays : స్కూల్​ విద్యార్థులకు ఇది ఎగిరి గంతేసే అంత పెద్ద శుభవార్త! ఎందుకంటే.. ఈ సెప్టెంబర్​ నెలలో భారీగా సెలవు రోజులు ఉన్నాయి. సెప్టెంబర్​ నెలలో ఏ రోజున పాఠశాలలు మూసి ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

School Holidays in September 2024
EtSchool Holidays in September 2024 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2024, 4:40 PM IST

School Holidays in September 2024 : సాధారణంగానే స్కూల్​ పిల్లలకు ప్రతి ఆదివారం, కొంతమందికి రెండో శనివారం సెలవు ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే! ఇంకా అధిక వర్షాలు, బంద్​ల​ వంటి కొన్ని కారణాల వల్ల కూడా పాఠశాలలు​ మూసి ఉంటాయి. అలాగే ముఖ్యమైన పండగల సందర్భంగా కూడా దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తారు. ఇదిలా ఉంటే.. ఈ సెప్టెంబర్​ నెల పిల్లలకు ఒక శుభవార్త తీసుకొస్తుందనే చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ నెలలో వివిధ పండగలు, పర్వ దినాల సందర్భంగా స్కూల్స్​కు వరుసగా సెలవులు వచ్చాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఏ రోజున స్కూల్స్​ మూసి ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

ఈ సెప్టెంబర్​ నెలలోనే అనగానే అందరికీ ఇష్టమైన వినాయక చవితి వస్తుంది. ఈ పండగ కోసం చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. వయసుతో బేధం లేకుండా అందరూ ఎంతో ఆనందంతో వినాయక చవితి, నిమజ్జనం ఉత్సవాలను జరుపుకొంటారు. అయితే ఈ సెప్టెంబర్​ నెలలో వినాయక చవితి పండగ 7వ తేదీ శనివారం రోజున జరుపుకోనున్నారు. మరుసటి రోజు ఆదివారం కావడంతో సెప్టెంబర్​ 8వ తేదీ కూడా పాఠశాలలకు సెలవు దినం. వరుసగా రెండు రోజులు కలిసి రావడం వల్ల పిల్లలకు ఎగిరి గంతేస్తున్నారు.

వరుసగా మూడు రోజులు సెలవులు!
ఈ నెలలో వరుసగా మూడు రోజులపాటు స్కూల్స్​ బంద్​ ఉండనున్నాయి. అది ఎప్పుడంటే.. సెప్టెంబర్​ 14వ తేదీ రెండో శనివారం కారణంగా పాఠశాలలకు సెలవు. ఆ తర్వాత సెప్టెంబర్​ 15వ తేదీ ఆదివారం కావడంతో పాఠశాలలకు హాలీ డే. ఇక సెప్టెంబర్​ 16వ తేదీ అంటే సోమవారం రోజున మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఇ మిలాద్ (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు) సందర్భంగా పాఠశాలలకు సెలవు ఉంటుంది. ఇలా స్కూల్స్​కు వరుసగా మూడు రోజులు సెలవులు ఉండడం.. ఇంకా ఇదే సమయంలో వినాయక చవితి ఉత్సవాలు కలిసి రావడం పిల్లలకు మరొక గుడ్​న్యూస్​గా చెప్పుకోవచ్చు.

సెప్టెంబర్​లో పాఠశాలలు బంద్​ ఉండే తేదీలు ఇవే..

  • సెప్టెంబర్​ 1 (ఆదివారం)
  • సెప్టెంబర్​ 7 (శనివారం): వినాయక చవితి సందర్భంగా సెలవు
  • సెప్టెంబర్​ 8 (ఆదివారం)
  • సెప్టెంబర్​ 14 (రెండో శనివారం)
  • సెప్టెంబర్​ 15 (ఆదివారం)
  • సెప్టెంబర్​ 16 (సోమవారం) : మిలాద్-ఉన్-నబీ లేదా ఈద్-ఇ మిలాద్ (ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు) సందర్భంగా సెలవు
  • సెప్టెంబర్​ 22 ఆదివారం సెలవు
  • సెప్టెంబర్​ 29 (ఆదివారం)
  • మొత్తంగా చూస్తే ఈ సెప్టెంబర్​ నెలలో దాదాపు 8 రోజులు స్కూల్స్​ మూసి ఉండనున్నాయి. ఇంకా వర్షాలు, ఏవైనా బంద్​ల కారణంగా సెలవులు ఉంటే.. ఇక పిల్లలకు పండగే!

ఇవి కూడా చదవండి :

2024 సెప్టెంబర్​ నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - Bank Holidays in September 2024

వేసవి సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా?- నల్లమలను చూసొద్దాం రండి - Nallamala Forest Tourism Packages

ABOUT THE AUTHOR

...view details