Kitchen Waste for Plants :నగరాల్లో అపార్ట్మెంట్ కల్చర్ బాగా పెరిగిపోయింది. అపార్ట్‌మెంటుల్లో నివసించే వారికి మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి ఉన్నా, స్థలం అందుబాటులో ఉండదు. ఇలాంటి వారు బాల్కనీలో, టెర్రస్ మీద మొక్కలను పెంచుకుంటున్నారు. వీటిలో అలంకార పూలు, ఆకు కూరలు, కూరగాయల మొక్కలు ఉంటున్నాయి. ఆరోగ్యకరమైన జీవన శైలికి ఈ చిన్న గార్డెన్లు దన్నుగా నిలుస్తాయి. ఈ క్రమంలో మొక్కలు నాటిన కొన్ని రోజుల తర్వాత పూలూ, కూరగాయలు, పళ్లు వంటివి రాకపోయే సరికి అక్కడితో వదిలేస్తారు. అయితే, ఇలా మొక్కలు ఎదగకపోవడానికి మట్టిలో సారం లేకపోవడం ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. కొన్ని టిప్స్ పాటించడం వల్ల మొక్క బలంగా పెరుగుతుందని అంటున్నారు. ఆ చిట్కాలు మీ కోసం.
అరటి తొక్కలు : బాల్కానీ, టెర్రస్‌పైన ఎక్కువ మంది చామంతి, గులాబీ, కనకాంబరాలు వంటి పూల మొక్కలు పెంచుతుంటారు. అయితే, ఈ మొక్కలు పూలతో నిండుగా విరబూయాలంటే పొటాషియం మోతాదు సరిపడా మట్టిలో ఉండాలి. అయితే, మనం తినే చెత్తబుట్టలో పడేసే అరటితొక్కల్లో పొటాషియం పుష్కలంగా దొరుకుతుంది. అందుకే, దీన్ని పేస్ట్‌లా చేసి మొక్క చుట్టూ ఉండే మట్టిలో కలపాలి. దీంతో పూల మొక్కలు బాగా పెరుగుతాయి.
కాఫీ గింజలు:వాడేసిన కాఫీ గింజల్లో ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, నత్రజని, కాపర్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి వాటర్‌ని నిల్వ చేసుకోవడం, గాలి ప్రసరణను మెరుగుపరచడం వంటి ప్రయోజనాలను అందిస్తాయి.
గుడ్డు పెంకులు :వీటిల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. టమాటాలు, మిరప వంటి మొక్కలు బాగా పెరగడానికి ఇది చాలా అవసరం. ఉడికించిన గుడ్డు నీళ్లనూ మొక్కలకు పోసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
చెక్కబూడిద : చెక్క బూడిదలో పొటాషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి నేల ఆల్కలైనిటీని పెంచుతుంది.