How to Prevent Ice Buildup in Freezer:నార్మల్‌గా ప్రతి ఫ్రీజర్‌లోనూ ఐస్ ఏర్పడుతుంటుంది. కానీ కొన్ని ఫ్రిడ్జ్‌లలో ఇది అసాధారణంగా ఫామ్ అవుతుంటుంది. ఎన్నిసార్లు తొలగించినా ఫ్రీజర్ నిండా ఐస్ గడ్డల్లాగా ఏర్పడుతూ ఆ ప్లేస్ మొత్తం ఆక్రమిస్తుంటుంది. దీన్ని అలాగే వదిలేస్త్ ఫ్రీజర్‌లో ఏ పదార్థాలు పెట్టడానికి వీలుండదు. ఇలా ఫ్రీజర్‌లో ఎక్కువ మొత్తంలో ఐస్ పేరుకుపోవడం రిఫ్రిజిరేటర్పనితీరుపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొన్ని టిప్స్ పాటించడం వల్ల ఇలా ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోకుండా చూసుకోవచ్చని అంటున్నారు. ఆ చిట్కాలు మీ కోసం.
అవసరమున్నప్పుడే డోర్ తీయాలి!కొందరు చీటికిమాటికి ఫ్రిడ్జ్ తలుపులు ఓపెన్ చేస్తుంటారు. మరికొంతమంది డోర్ ఎక్కువసేపు తెరిచి ఉంచుతుంటారు. ఈ క్రమంలో ఫ్రీజర్ డోర్ సరిగ్గా మూసుకోకపోతే వెచ్చని గాలి లోపలికి ప్రవేశించి, ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతుంది. కాబట్టి, అవసరమున్నప్పుడే ఫ్రిడ్జ్ డోర్ తీసి వెంటనే క్లోజ్ చేయాలని చెబుతున్నారు.
రబ్బర్ సీలింగ్ గ్యాస్కెట్స్ :ఫ్రిడ్జ్ డోర్స్‌కు ఉన్న రబ్బర్ సీలింగ్ గ్యాస్కెట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి. అవసరమైతే వీటిని మీ ఫ్రిడ్జ్ కంపెనీని బట్టి 2 నుంచి 5 ఏళ్ల మధ్య కాలంలో మార్చుకోవడం మంచిది. దీనివల్ల ఫ్రీజర్/ఫ్రిడ్జ్ పనితీరు మెరుగుపడుతుందని సూచిస్తున్నారు.
దేశంలోనే అతి చిన్న రైలు ఏమిటో తెలుసా? - కేవలం మూడు బోగీలతో ప్రయాణం!
మాన్యువల్ చెక్ చేయండి :ఫ్రీజర్‌లో ఐస్ ఎక్కువగా ఏర్పడేవారు మీరు ఫ్రిడ్జ్ కొన్నప్పుడు అందించిన మాన్యువల్‌ని ఓసారి చెక్ చేయండి. అందులో ఫ్రీజర్ థర్మోస్టాట్‌కు సంబంధిత సెట్టింగ్స్ వివరాలు ఉంటాయి. వాటిని చూసి సెట్టింగ్స్ మార్చుకోండి. దీనివల్ల ఫ్రీజర్‌లో ఐస్ ఫామ్‌ని తగ్గించుకోవచ్చు.