ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / offbeat

పిల్లల షూ ఎలా క్లీన్ చేయాలి? - వాషింగ్ మిషన్​లో వేయొచ్చా! - SHOES CLEANING IN WASHING MACHINE

స్కూల్ పిల్లల షూ క్లీనింగ్ పెద్ద టాస్క్ - పరిశుభ్రంగా లేకుంటే ఇన్​ఫెక్షన్లు

shoes_cleaning_in_washing_machine
shoes_cleaning_in_washing_machine (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 7, 2025, 12:26 PM IST

shoes cleaning in washing machine :స్కూల్ పిల్లల షూ క్లీన్ చేయడం పెద్ద టాస్కే. వారంలో రెండు సార్లు వీటిని శుభ్రం చేయాల్సి ఉండడంతో కొంత మంది పైపైన శుభ్రం చేసి వదిలేస్తుంటారు. కానీ, కొంత మంది వాషింగ్ మెషీన్లలో పడేస్తుంటారు. ఈ నేపథ్యంలో షూ ఎలా శుభ్రం చేసుకోవాలి? వాషింగ్ మెషీన్​లో శుభ్రం చేయడం సాధ్యాసాధ్యాలపై ప్రత్యేక కథనం.

స్కూల్ పిల్లల యూనిఫామ్ మాత్రమే కాదు టై, షూ కూడా ఎంతో పరిశుభ్రంగా ఉండాల్సిందే. రోజు వారీ యూనిఫాంతో పాటు వారంలో రెండు సార్లు వేసుకునే స్పోర్ట్స్ డ్రెస్, షూ కూడా తళతళలాడాల్సిందే. తెల్లని స్పోర్ట్స్ షూ అవి వేసుకున్న రోజే మట్టిగొట్టుకుని పోతాయి. మైదానంలో ఆటపాటల్లో మునిగితేలే చిన్నారులు షూ అంతా మట్టి మరకలే ఉంటాయి. వాటిని పైపైన తుడిచి వదిలేయకుండా లోతైన శుభ్రత తప్పనిసరి.

రూ.40కోట్లు పలికిన 'నెల్లూరు ఆవు' - బహిరంగ వేలంలో ప్రపంచ రికార్డు

షూ కొన్నాక బాక్సు మీద చెక్‌ చేస్తే వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలి? ఎలా భద్రపరుచుకోవాలి? అనే విషయాలు ముద్రించి ఉంటాయి. వాస్తవానికి అవి పాలో అయితే సరిపోతుంది. కానీ, లెదర్, తోలు, రబ్బర్, వినైల్‌ తో తయారైన వాటిని చేతితో మాత్రమే శుభ్రం చేసుకోవాలి. లేదంటే అవి దెబ్బతిని, షేప్, మన్నిక కోల్పోతాయి. కాన్వాస్, నైలాన్, కాటన్, పాలిస్టర్‌ పదార్థాలతో తయారైన షూ వాషింగ్‌ మెషీన్‌లో పడేస్తే ఇబ్బంది లేదు. కానీ, ఎంబ్రాయిడరీ, సీక్విన్లు, రాళ్లు లాంటివి ఉంటే వాటిని చేతులతోనే శుభ్రం చేసుకోవాలి.

డిటర్జెంట్‌ కూడా ముఖ్యమే!

కొన్ని రకాల షూస్ మెషీన్‌లో ఉతకడానికి వీలుగా ఉన్నా డిటర్జెంట్‌లలోని కఠిన రసాయనాలు హాని కలిగించొచ్చు. టేబుల్‌ స్పూన్ డిటర్జంట్ వాడుకుంటే సరిపోతుంది. అదే విధంగా ఎక్కువ వేడినీటిని వాడుతుంటే అవి కుచించుకుపోయే ప్రమాదం ఉంటుంది. గోరువెచ్చని నీటినే శుభ్రం చేయడంతోపాటు క్లాత్‌తో తయారైనవైనా సరే బ్లీచ్, ఫ్యాబ్రిక్‌ సాఫ్ట్‌నర్‌ వాడకపోవడం మంచిది.

ప్రీ క్లీనింగ్‌ ముఖ్యం

మార్నింగ్, ఈవెనింగ్ వాక్ మాత్రమే కాదు ఆఫీసుకు కూడా షూ వేసుకుని వెళ్తుంటాం. వాటితో ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చేస్తాం. షూ వెనుక వైపు మట్టి అతుక్కుపోయి ఉంటుంది. వాటిని అలాగే వాషింగ్ మిషన్​లో వేస్తే మరకలు పోవడం సంగతేమోదానీ వాషింగ్‌ మెషీన్‌ దెబ్బతింటుంది. అందుకే అలాంటి వాటిను ముందుగా పాత టూత్‌ బ్రష్‌తో శుభ్రం చేసుకోవాలి. మట్టిని తొలగించడంతో పాటు ఇన్‌సోల్స్, షూ లేసులు తీసి కడిగితే మంచిది.

షూ నేరుగా మెషీన్‌లో పడేయకుండా పాత తువాలు కట్టి వేస్తే మెషీన్‌ తిరుగుతున్నప్పుడు అవి పాడవకుండా ఉంటాయి. వాషింగ్ మెషీన్ లో స్పిన్‌ ఆప్షన్​లో ఉంచుకుంటే మంచిది.

ఆరబెట్టేటప్పుడూ జాగ్రత్త!

క్లీన్ చేసిన షూ నేరుగా ఎండలో పెట్టకుండా లోపల పేపర్‌ టవళ్లు, లేదా పాత వస్త్రాలను ఉంచాలి. పూర్తిగా ఆరిపోయేలా చూసుకోవాలి. లేదంటే శుభ్రం చేసిన ఫలితం దక్కదు. తడిగా ఉండడం వల్ల సూక్ష్మజీవులకు ఆవాసంగా మారి పాదాల ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తాయి. లోతైన పరిశుభ్రత మంచిదే కానీ, తగిన జాగ్రత్తలు తప్పనిసరి.

'వాలంటైన్స్ వీక్ స్పెషల్'​ - ఇంప్రెస్ చేయడానికి కొన్ని టిప్స్!

ఇంద్రధనస్సులో రంగులు సీతాకోక చిలుకలకు ఎలా వచ్చాయి? - ఎంతో ఆసక్తికరం

ABOUT THE AUTHOR

...view details