ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / health

ఈ చైనా వెజ్​ వంటకం తింటే వదలం- క్షణాల్లో ఖాళీ చేయడం ఖాయం - Chinese food

CHILLI POTATO : చైనీస్‌ వంటలు అనగానే 'వామ్మో' అంటూ పారిపోవాల్సిన పని లేదు. మేం శాకాహారులం.. ‘మాకొద్దు బాబోయ్‌ అంటూ వాళ్లు తినే ఫుడ్​ ఊహించుకుంటూ ఆందోళన అక్కర్లేదు. చిల్లీ పొటాటో రుచి చూశారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు.

chilli_potato
chilli_potato (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 9, 2024, 7:52 PM IST

CHILLI POTATO : చైనీస్‌ వంటలు అనగానే వామ్మో అంటూ పారిపోవాల్సిన అవసరమేం లేదు. మేం పక్కా శాకాహారులం.. ‘మాకొద్దు బాబోయ్‌ అంటూ వాళ్లు తినే ఫుడ్​ ఊహించుకుంటూ ఆందోళన అక్కర్లేదు. నిజానికి వాళ్ల వంటల్లో కమ్మటి శాకాహార రుచులెన్నో మన జిహ్వ చాపల్యాన్ని తీర్చేస్తాయి. చేపలు, రొయ్యలు, పీతలు, చికెన్, మటన్​కు బదులు చిల్లీ పొటాటో వంటకం తిని చూస్తే చాలు మళ్లీ మళ్లీ కావాలంటారు. చిల్లీ పొటాటో టేస్ట్ చూద్దామా?

ఇది రాజస్థాన్‌ వాళ్ల పాయసం- మన స్టైల్లో వండితే అమృతమే! - gehu ka doodhiya kheech

చిల్లీ పొటాటో తయారీకి కావాల్సిన పదార్థాలు

  • బంగాళదుంపలు - అర కిలో
  • నూనె - వేయించేందుకు సరిపడా
  • చిల్లీ పౌడర్‌ - 2 చెంచాలు
  • రెడ్‌ చిల్లీ - చెంచా
  • వెల్లుల్లి పేస్టు - చెంచా
  • మైదా - 3 టేబుల్‌స్పూన్లు
  • మొక్కజొన్న పిండి - 3 టేబుల్‌స్పూన్లు
  • ఉప్పు - తగినంత
  • మైదా - ముప్పావు కప్పు
  • మొక్కజొన్న పిండి - ముప్పావు కప్పు
  • మిరియాల పొడి - పావు చెంచా
  • నీళ్లు - పావు కప్పు
  • నూనె - 2 టేబుల్‌స్పూన్లు
  • వెల్లుల్లి తరుగు - టేబుల్‌స్పూన్
  • వెనిగర్
  • రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్ - స్పూన్
  • మొక్కజొన్న పిండి - స్పూన్
  • తెల్ల నువ్వులు - 3 టేబుల్‌స్పూన్లు
  • తేనె - 3 టేబుల్‌స్పూన్లు
  • సోయా సాస్‌ - 2 చెంచాలు
  • టొమాటో కెచప్‌ - 2 టేబుల్‌స్పూన్లు
  • రెడ్‌ చిల్లీ పేస్టు - 2 చెంచాలు
  • నీళ్లు - పావు కప్పు (సాస్​ కోసం)
  • ఉల్లి కాడల తరుగు - 2 టేబుల్‌స్పూన్లు
  • మిరియాల పొడి - అర చెంచా

తయారీ విధానం

చెక్కు తీసిన బంగాళాదుంపలను ఫ్రెంచ్‌ ఫ్రైస్‌లా సన్నగా, నిలువుగా ముక్కలు కోసుకోవాలి. వాటిని నీళ్లలో వేసి తీయాలి. తర్వాత ఒక గిన్నెలో మైదా, మొక్కజొన్న పిండి, ఉప్పు, చిల్లీ పౌడర్, రెడ్‌ చిల్లీ, వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపి బంగాళదుంప ముక్కలకు ఒక కోటింగ్‌ పట్టించాలి. ఆ తర్వాత కడాయిలో మరుగుతున్న నూనెలో ముక్కలు వేసుకుని విడతలవారీగా రెండుసార్లు వేయించాలి. ఒకేసారి పూర్తిగా వేగనివ్వకుండా చల్లారేలోగా మొదటి కోటింగ్‌ కోసం కలిపిన పాత్రలో నీళ్లు, మైదా, మొక్కజొన్న పిండి, మిరియాల పొడి వేసి కలపుకోవాలి. సగం వేగిన ముక్కలకు ఈ మిశ్రమం రెండో సారి పట్టించి మరోసారి నూనెలో వేయించుకోవాలి.

తర్వాత పాన్‌లో 2 టేబుల్‌ స్పూన్ల నూనె వేడి చేసి వెల్లుల్లి తరుగును వేయించుకోవాలి. అందులో రెడ్‌ చిల్లీ ఫ్లేక్స్, తెల్ల నువ్వులు వేసుకుని వెనిగర్, సోయా సాస్‌, టొమాటో కెచప్, రెడ్‌ చిల్లీ పేస్టు కలపాలి. ఇదే సమయంలో మొక్కజొన్న పిండిని పావు కప్పు నీళ్లతో కలిపి పాన్‌లో పోసుకుని కలియబెట్టాలి. చిక్కగా అయ్యాక చివరగా బంగాళదుంప ముక్కలు, ఉల్లి కాడల తరుగు, మిరియాల పొడి వేసి కలుపుకొని అర నిమిషం తర్వాత దించేయాలి. చివరగా పైన ఇంకొన్ని తెల్ల నువ్వులు, ఉల్లికాడల తరుగు చల్లితే చాలు నోరూరించే చిల్లీ పొటాటో తినడానికి సిద్ధంగా ఉన్నట్టే.

జామపండు Vs డ్రాగన్​ ఫ్రూట్ - విటమిన్​ పోటీలో విన్నర్​ ఎవరంటే! - GUAVA VS DRAGON FRUIT

ఆయుర్వేదం సీక్రెట్​ ఇదే- టాప్​టెన్​ తొమ్మిది పదార్థాలు మీకు తెలిసినవే! - Top 9 herbs in Ayurvedic medicine

ABOUT THE AUTHOR

...view details