ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / entertainment

27ఏళ్లకే తనువు చాలించిన సింగర్‌- ముందే లేఖ రాసిన గాయని - విషమిచ్చి చంపారంటున్న కుటుంబ సభ్యులు - ruksana bano mysterious death - RUKSANA BANO MYSTERIOUS DEATH

ప్రముఖ సింగర్ రుక్సానా బానో (27) చనిపోయింది. సినిమా పాటలు, ప్రత్యేక ఆల్బమ్‌ సాంగ్స్ పాడుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒడియా సింగర్‌ అనుమానాస్పదంగా మృతి చెందారు. రుక్సానా మృతి వెనుక ప్రత్యర్థి సింగర్‌ ఉన్నారని వాళ్లే ఈమెకు విషమిచ్చి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ప్రముఖ సింగర్ రుక్సానా బానో
ప్రముఖ సింగర్ రుక్సానా బానో (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2024, 12:04 PM IST

ఒడిశా సంబల్‌పూర్‌ పట్టణానికి చెందిన రుక్సానా బానో ఆల్బమ్ సాంగ్స్ పాడుతూ బాగా గుర్తింపు తెచ్చకుంది. ఆల్బమ్‌ సాంగ్స్‌ చిత్రీకరించేందుకు బోలంగిర్‌ వెళ్లిన రుక్సానా అనారోగ్య సమస్యలతో గత నెల 27న స్థానిక ఆస్పత్రిలో చేశారు. బోలంగిరి ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం బార్గర్‌ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేక చికిత్స పొందుతూ రుక్సానా చనిపోవడం అభిమానులకు షాక్‌కి గురిచేసింది. ఇంత చిన్న వయసులోనే ఆమె చాలించడంపై ఆమె తల్లి, సోదరి చేసిన ఆరోపణలు మాత్రం ఒడిశాలో చర్చనీయాంశంగా మారిపోయాయి.

ప్రముఖ సింగర్ రుక్సానా బానో (ETV Bharat)

ఒడియా సాంగ్స్ పాడుతూ ఫేమస్ అయిన రుక్సానా బానో.. సామాజిక సమస్యలపైనా గొంతుఎత్తేవారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యూట్యూబ్‌, ఇన్‌స్టా వంటి సామాజిక వేదికలపై బాగా పాపులర్‌ అయినా రుక్సానా బానో ఇటీవలే సినిమా పాటులు కూడా పాడుతూ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒడియా భాషలో అక్కడి జానపదాలు, సామాజిక అంశాలపై రుక్సానా పాడే పాటలు సమాజాన్ని చాలా ప్రభావితం చేశాయి.

ప్రముఖ సింగర్ రుక్సానా బానో (ETV Bharat)

అయితే రుక్సానా బానో కొన్నాళ్ల క్రితం షూటింగ్ చేసేందుకు స్థానిక బోలంగిర్ అనే గ్రామం వెళ్లారు. షూటింగ్‌ మధ్యలో ఆమెబృందంలోని సభ్యుల ఇచ్చిన పండ్ల రసం తాగిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైంది. వెంటనే సమీపంలోని భవానీపట్నం ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు. వాస్తవానికి రుక్సానాఆగస్టు 27న ఆసుపత్రి పాలయ్యారు. అప్పటినుంచి బోలంగిర్‌లోని పెద్దస్పత్రిలో చికిత్స కొనసాగుతున్నా ఫలితం లేకపోవడంతో ఇటీవలే బార్గర్ ఆస్పత్రికి ఆమెను షిఫ్ట్ చేశారు. బార్గర్‌ ఆసుపత్రిలోనూ రుక్సానా ఆరోగ్యం కుదుటపడటకపోవటంతో మెరుగైన వైద్యం కోసం భువనేశ్వర్‌ ఎయిమ్స్‌కి తరలించారు. కానీ అక్కడా ఆమె కోలుకోలేదు. చివరకు బుధవారం రాత్రి ఆసుపత్రిలోనే రుక్సానా బానో తుది శ్వాస విడిచారు.

ప్రముఖ సింగర్ రుక్సానా బానో (ETV Bharat)

అయితే రుక్సానా మృతిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె జ్యూస్‌ తాగి చనిపోలేదని, విషపురుగు కాటు వేయడంతో ఆసుపత్రికి వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. కానీ కుటుంబ సభ్యులు ఇందుకు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. సింగర్‌గా బానో రాణించడం నచ్చని ప్రత్యర్థి సింగర్‌ ఒకరు ఆమెకు షూటింగ్‌లో విషపు జ్యూస్‌ ఇప్పించారని ఆరోపించారు. సింగర్‌గా సినీ ప్రపంచంలో రాణించాలని ఎన్నో కళలు కన్న రుక్సానా బానో ఇలా అర్థాంతరంగా అనుమానాస్పద మృతి చెందడం,ఒడియా చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.

మృతిని ముందే గుర్తించిందా?

మరోవైపు రుక్సానా చేతిరాతతో రాసిన లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లేఖలో రుక్సానా తాను చాలా బాధపడుతున్నానని, సహిమాన్ మొహంతి అనే యువతి తన ప్రాణాలను తీయవచ్చు కానీ ఆమెను బాధపెట్టవద్దని లేఖలో పేర్కొంది. ఈ లేఖపై రుక్సానా సోదరి రుబీనా బానో మాట్లాడుతూ.. ‘‘సంబావాలి అనే గాయని రుక్సనాను చిత్రహింసలకు గురిచేసేదని, చిత్ర పరిశ్రమలో పని చేయవద్దని బెదిరించిందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details