Allu Sirish Teddy Movie Trailer :యంగ్ హీరో అల్లు శిరీష్ ప్రస్తుతం స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో ఆయన నటించిన కొన్ని చిత్రాలు యావరేజ్ టాక్‌తో కొనసాగగా, ఈ హీరో కూడా సైలెంట్‌గానే ఉండిపోయారు. ఎటువంటి అప్‌కమింగ్ మూవీస్ అప్డేట్ ఇవ్వకుండా ఫ్యాన్స్‌ను నిరాశపరిచారు. కానీ ఈ సారి మాత్రం ఫుల్ ఆన్ యాక్షన్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. 'బడ్డీ' అనే కొత్త సినిమాతో అలరించనున్నారు. ఈ నేపథ్యంలో తాజగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఆద్యంతం ఎంటర్టైనింగ్గా ఉన్న ఈ గ్లింప్స్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
అన్యాయాన్ని ఎదురించే టెడ్డీ బేర్‌కు శిరీష్ హెల్ప్ చేస్తారా? - Allu Sirish Teddy Movie - ALLU SIRISH TEDDY MOVIE
Allu Sirish Teddy Movie Trailer : టాలీవుడ్ నటుడు అల్లు శిరిష్ ప్రధాన పాత్రలో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం 'బడ్డీ'. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అందులో అన్యాయం పై తిరగ బడ్డ టెడ్డీబేర్‌ను చూపిస్తామని మేకర్స్ అంటున్నారు. మరి మీరూ దాన్ని చూసేందుకు సిద్ధమేనా?

Published : Jun 25, 2024, 6:35 PM IST
"చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు అన్యాయం జరిగిన, ఎదురు తిరిగిన సింహాన్ని, పులిని చూసుంటారు. అన్యాయం పై తిరగ బడ్డ టెడ్డీబేర్‌ను చూశారా? మేం చూపిస్తాం" అంటూ సాయి కుమార్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇక పైలట్‌గా అల్లు శిరీష్ ఎంట్రీ, హీరోయిన్ ఇంట్రడక్షన్, మూవీలోని పలు కీ ఎలిమెంట్స్‌ను మేకర్స్ క్లుప్తంగా చూపించారు. ఇక విలన్స్‌ను టెడ్డీబేర్ చితక్కొట్టే తీరు ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది.
ఇక 'బడ్డీ' సినిమా విషయానికి వస్తే, సామ్ అంటోన్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోలీవుడ్‌లో విడుదలైన 'టెడ్డీ' సినిమాకి రీమేక్‌గా రూపొందింది. గాయత్రీ భరద్వాజ్, అజ్మల్ అమీర్, ప్రిషా సింగ్, ముకేశ్ రిషి, హాస్య నటుడు అలీ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. హిప్‌హాప్ తమిళన్ బాణీలు అందిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. జులై 26న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది.