TS Inter Results 2024 : తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలైయ్యాయి. హైదరాబాద్లోని నాంపల్లిలో ఉన్న ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను ప్రకటించారు. ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు జరిగిన పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు రాశారు. ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం ఇక్కడ https://results.cgg.gov.in క్లిక్ చేయండి. ఫలితాలను ఇక్కడ కూడా results.eenadu.netలో చెక్ చేసుకోవచ్చు.
ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్ - రిజల్ట్స్ చూసుకోండిలా - ap intermediate 2024 results
తెలంగాణ వ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 9.81 లక్షల మంది విద్యార్థుల పరీక్ష రాయగా, ఇందులో ప్రథమ సంవత్సరంలో 2.87 లక్షల మంది, ద్వితీయ సంవత్సరంలో 3.22 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్లో 60.01 శాతం, సెకండ్ ఇయర్లో 64.19 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.