తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

డిగ్రీ పాస్​తో రైల్వేలో జాబ్ - నోటిఫికేషన్ రిలీజైంది - త్వరగా అప్లై చేసుకోండిలా! - RRB Recruitment 2024

RRB Recruitment 2024: రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. 8,113 ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో స్టేషన్ మాస్టర్ సహా కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు ఉన్నాయి. ఈ క్రమంలోనే అప్లై విధానం, దరఖాస్తు తేదీ తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

RRB Recruitment 2024
RRB Recruitment 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 5:25 PM IST

RRB Recruitment 2024:దేశవ్యాప్తంగా ఉన్న రీజియన్లలో సుమారు 8,113 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ). వీటిలో 1,736 కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు ఉండగా.. 3,144 గూడ్స్‌ రైలు మేనేజర్‌ ఖాళీలు ఉన్నాయి. ఇవే కాకుండా స్టేషన్ మాస్టర్, జూనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌, సీనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏ రీజియన్లలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? దరఖాస్తు ఫీజు ఎంత? అప్లై చేసుకునే విధానం లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టు పేరు ఖాళీలు
కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ సూపర్‌వైజర్‌ 1,736
స్టేషన్‌ మాస్టర్‌ 994
గూడ్స్‌ రైలు మేనేజర్‌ 3,144
జూనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌ 1,507
సీనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ 732

రీజియన్ల వారీగా ఖాళీలు:

రీజియన్ పేరు ఖాళీలు
ఆర్‌ఆర్‌బీ సికింద్రాబాద్‌ 478
ఆర్‌ఆర్‌బీ బెంగళూరు 496
ఆర్‌ఆర్‌బీ చెన్నై 436
ఆర్‌ఆర్‌బీ భువనేశ్వర్‌ 758

ఎవరు అర్హులు:యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎదైనా బ్యాచిలర్స్‌ డిగ్రీ పట్టా పొంది ఉండాలి. జూనియర్‌ అకౌంట్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌/ సీనియర్‌ క్లర్క్‌ కమ్‌ టైపిస్ట్‌ పోస్టులకు డిగ్రీతో పాటు అదనంగా కంప్యూటర్‌లో ఇంగ్లిష్‌/ హిందీలో టైపింగ్‌ ప్రావీణ్యం తప్పనిసరి ఉండాలి.

వయసు: 01-01-2025 నాటికి 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు.. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు.. దివ్యాంగులకు పదేళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.

ప్రారంభ వేతనం: చీఫ్‌ కమర్షియల్‌ కమ్‌ టికెట్‌ సూపర్‌వైజర్‌/ స్టేషన్‌ మాస్టర్‌ పోస్టుకు నెలకు రూ.35,400 జీతం ఉంటుంది. ఇతర పోస్టులకు నెల జీతం రూ.29,200 అందుకుంటారు.

దరఖాస్తు రుసుము: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.500 చెల్లించాలి. మిగిలిన ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.

ఎంపిక విధానం:

  • కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (టైర్‌-1, టైర్‌-2)
  • టైపింగ్‌ స్కిల్‌ టెస్ట్‌/ కంప్యూటర్‌ ఆధారిత ఆప్టిట్యూడ్‌ టెస్ట్
  • డాక్యుమెంట్‌ వెరిఫికేషన్
  • మెడికల్‌ ఎగ్జామినేషన్‌

దరఖాస్తు విధానం..

  • ముందుగా మీకు కావాల్సిన ఆర్​ఆర్​బీ రీజియన్ అధికారిక వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • అందులో కనిపించే RRB NTPC Recruitment 2024 లింక్​పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీ పేరు, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్​లను ఎంటర్​ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
  • అనంతరం మీకొక ఎన్​రోల్​మెంట్ ఐడీ, పాస్​వర్డ్ జనరేట్ అవుతుంది.
  • ఈ వివరాలతో మళ్లీ ఆర్​ఆర్​బీ పోర్టల్​లోకి లాగిన్ కావాలి.
  • ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అనంతరం మీరు అప్లై చేయాలని భావిస్తున్న పోస్టును ఎంచుకోవాలి.
  • ఆపై ఆన్​లైన్​లోనే దరఖాస్తు రుసుము చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకొన్న తర్వాత అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 13-10-2024.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 15.10.2024.

వెబ్‌సైట్‌: https://indianrailways.gov.in/

SSC భారీ నోటిఫికేషన్​ - పదో తరగతి అర్హతతో - 39481 (GD) కానిస్టేబుల్ పోస్టులు భర్తీ! - SSC GD Notification 2025

ఇంటర్​, డిగ్రీ అర్హతతో - రైల్వేలో 11,558 పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - RRB NTPC Recruitment 2024

ABOUT THE AUTHOR

...view details