తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

NPCILలో 335 ఉద్యోగాలు - పరీక్ష లేకుండానే నియామకం - దరఖాస్తు చేసుకోండిలా! - NPCIL Trade Apprentice Posts 2024 - NPCIL TRADE APPRENTICE POSTS 2024

NPCIL Recruitment 2024 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్​. న్యూక్లియర్​ పవర్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్​ (NPCIL) 335 ట్రేడ్ అప్రెంటీస్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

NPCIL trade apprentice posts 2024
NPCIL Recruitment 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 10:26 AM IST

NPCIL Recruitment 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (ఎన్​పీసీఐఎల్​) 335 ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • ఫిట్టర్​ - 94 పోస్టులు
  • ఎలక్ట్రీషియన్​ - 94 పోస్టులు
  • ఎలక్ట్రానిక్ మెకానిక్ - 94 పోస్టులు
  • కంప్యూటర్ ఆపరేటర్​ & ప్రోగ్రామ్ అసిస్టెంట్​ - 14 పోస్టులు
  • టర్నర్ - 13 పోస్టులు
  • మెషినిస్ట్ - 13 పోస్టులు
  • వెల్డర్ - 13 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 335

విద్యార్హతలు
NPCIL Trade Apprentice Eligibility :అభ్యర్థులు ఫిట్టర్​, ఎలక్ట్రీషియన్​, ఎలక్ట్రానిక్స్​ మెకానిక్​, సీవోపీఏ, టర్నర్​, మెషినిస్ట్​​, వెల్డర్​ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
NPCIL Trade Apprentice Age Limit :అభ్యర్థుల వయస్సు 2024 ఏప్రిల్ 4 నాటికి 14 ఏళ్ల నుంచి 24 ఏళ్లలోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

అప్లికేషన్ ఫీజు
NPCIL Trade Apprentice Application Fee :అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ
NPCIL Trade Apprentice Selection Process :ఐటీఐలో వచ్చిన మార్కులు, రూల్​ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

స్టైపెండ్​
NPCIL Trade Apprentice Salary :ట్రేడ్ అప్రెంటీస్​లకు నెలకు రూ.7,700 నుంచి రూ.8,855 వరకు స్టైపెండ్ ఇస్తారు.

దరఖాస్తు విధానం
NPCIL Trade Apprentice Application Process :

  • అభ్యర్థులు ముందుగా https://www.apprenticeshipindia.gov.in/ పోర్టల్ ఓపెన్ చేయాలి.
  • మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేసి పోర్టల్​లో రిజిస్టర్ చేసుకోవాలి.
  • వెంటనే మీకొక రిజిస్టర్​ నంబర్​ జనరేట్ అవుతుంది. దానిని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి.
  • తరువాత మీరు https://www.npcil.nic.in వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్​ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 మార్చి 15
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఏప్రిల్ 4

టీసీఎస్ ఫ్రెషర్స్ హైరింగ్ షురూ - అప్లైకు మరో 11 రోజులే ఛాన్స్​ - వారికి స్పెషల్ ఏఐ ట్రైనింగ్​ కూడా! - TCS Hiring 2024

SSC భారీ నోటిఫికేషన్ - 968 జేఈ పోస్టుల భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - SSC JE Jobs 2024

ABOUT THE AUTHOR

...view details