IRCON Recruitment 2024 :ఇంజనీరింగ్ చేసి రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్. తాజాగా భారత రైల్వేశాఖకు చెందిన IRCON (ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ ఇంటర్నేషననల్ లిమిటెడ్)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్, రవాణా మౌలిక వసతులపై ఈ సంస్థ పనిచేస్తుంటుంది. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల నియామకాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలైన వివరాలు మీకోసం.
- పోస్టు : అసిస్టెంట్ మేనేజర్
- పోస్టుల సంఖ్య : 28
- దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : ఫిబ్రవరి 9
అర్హతలు
ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాల నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. బీటెక్‌లో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత చెంది ఉండాలి. రహదారులు, రైల్వేలు, బ్రిడ్జిల కన్స్ట్రక్షన్ విభాగాల్లో కనీసం రెండేళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ఉద్యోగ ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 30 ఏళ్లలోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
- ఆన్లైన్లో ఎగ్జామ్
- పర్సనల్ ఇంటర్య్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఆన్లైన్లో అప్లై చేయు విధానం
- ముందుగా IRCON అఫీషియల్ పోర్టల్ https://ircon.org/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- వెబ్‌సైట్‌లోని హోమ్‌పేజ్‌పై క్లిక్ చేయాలి. అక్కడ అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ అనే లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి పోస్టుకు సంబంధించిన వివరాలను చదవండి.
- ఆ తర్వాత హోమ్‌పేజ్‌లోని అప్లై నౌ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ముందుగా మీ పేరు, అడ్రస్ మొదలైన వివరాలు ఎంటర్ చేయాలి. ఈ మొత్తం వివరాలు నమోదు చేసి రిజిస్టర్ అవ్వాలి.
- మీ రిజిస్టర్ నంబర్‌తో లాగిన్ అయ్యి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభించాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
- మొత్తం వివరాలన్నింటిని ఎంటర్ చేశాక అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.