IBPS Recruitment 2024 : నిరుద్యోగ యువతకు శుభవార్త. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 9,995 గ్రూప్-ఏ- ఆఫీసర్(స్కేల్-1, 2, 3), గ్రూప్-బి ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో ఎంపికైన వారు రీజనల్ రూరల్ బ్యాంకు(ఆర్ఆర్బీ)ల్లో పని చేయాల్సి ఉంటుంది.
ఐబీపీఎస్ జూన్ 6న ఆర్ఆర్బీ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XIII నోటిఫికేషన్ను విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ గ్రామీణ బ్యాంకుల్లోని ఆఫీసర్(స్కేల్-1, 2, 3), ఆఫీస్ అసిస్టెంట్(మల్టీ పర్పస్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ పోస్టులు ఉన్నాయి.
పోస్టుల వివరాలు :
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) : 5,585 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-I : 3499 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్) : 70 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-II (లా) : 30 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-II (సీఏ) : 60 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-II (ఐటీ) : 94 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) : 496 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్) : 11 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ మేనేజర్) : 21 పోస్టులు
- ఆఫీసర్ స్కేల్-III : 129 పోస్టులు
- మొత్తం ఉద్యోగాల సంఖ్య : 9,995.
విద్యార్హతలు
IBPS RRB Job Qualifications :పోస్టులను అనుసరించి అభ్యర్థులు బ్యాచిలర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండి తీరాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
వయస్సు
IBPS RRB Job Age Limit :
- ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 ఏళ్లు నుంచి 30 ఏళ్లు ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు ఉండాలి.
- ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 21 నుంచి 40 ఏళ్లు మధ్యలో ఉండాలి.
- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము :
IBPS RRB Job Application Fee :
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.850 చెల్లించాలి.
- దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం
IBPS RRB Selection Process :అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ పెడతారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మెయిన్ ఎగ్జామ్కు సెలక్ట్ చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులైన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.