5 Best Car Features :కారు కొనాలని నిర్ణయించుకున్నప్పుడు అందులో అన్ని ఫీచర్లు ఉండాలని కోరుకుంటాం. తయారీదారులు ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా అనేక మార్పులతో కార్లను తీసుకొస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆటోమొబైల్ రంగంలో విస్తృతమైన మార్పులు వస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని కార్లను తయారు చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ప్రయాణాలు చేయడానికి కావాల్సిన బెస్ట్ ఫీచర్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్(Automatic Climate Control)
ప్రస్తుతం వస్తున్న కార్లలో ఈ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో ప్రయాణాలు చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. డ్రైవింగ్‌లో పదే పదే ఏసీ టెంపరేచర్‌ను అడ్జస్ట్ చేసే అవసరం లేకుండా చేస్తుంది. బయట ఉష్టోగ్రత ఎలా ఉన్నప్పటికీ లోపలి మాత్రం సౌకర్యవంతంగా ఉండేలా చేస్తుంది.
వెంటిలేటెడ్ సీట్స్ (Ventilated Seats)
ప్రస్తుతం వస్తున్న కార్లలో వెంటిలేటెడ్ సీట్స్ ముఖ్యమైన ఫీచర్‌గా ఉంది. వెంటిలేటెడ్ సీట్లు కారులోని డ్రైవర్ సీటుతో పాటు ప్రయాణికులకు కూడా ఉంటాయి. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సౌకర్యంగా ఉండేలా చేస్తుంది. సీజన్ బట్టి వెంటిలేటెడ్ సీట్స్ ప్రయాణాన్ని సాఫీగా చేస్తాయి. చలికాలంలో కారులో ప్రయాణించేటప్పుడు వెచ్చదనాన్ని అందిస్తుంది. ఇక సమ్మర్‌లో ఎంత ఏసీ ఉన్నప్పటికీ మనకు వేడి అనేది తెలియకుండా మంచి గాలి ప్రసరణతో చల్లగా ఉంచుతుంది.
హెడ్-అప్ డిస్‌ప్లే (HUD)
ఇప్పుడు అన్ని కార్లు హెడ్-అప్ డిస్‌ప్లేతో వస్తున్నాయి. డ్రైవర్లకు కావాల్సిన నావిగేష్ డైరెక్షన్లు, స్పీడ్, ఇంజిన్ ఉష్టోగ్రత, హెడ్‌లైట్ అప్డేట్ వంటి వాటిని డ్యాష్ బోర్డ్‌పై చూపిస్తుంది. డ్రైవింగ్ వేగాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉంటుంది. సురక్షితంగా ప్రయాణాలు చేసేలా చేస్తుంది.