లిఫ్ట్​లో ఇరుక్కుపోయిన ఎమ్మెల్యే - 15 నిమిషాల పాటు అందులోనే, చివరకు?

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2023, 4:05 PM IST

thumbnail

MLA Lasya Nandita stuck in lift in Secunderabad : సికింద్రాబాద్‌ న్యూ బోయిన్​పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వార్షికోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే లాస్య నందిత లిఫ్ట్‌లో చిక్కుకుపోయారు. ఆసుపత్రి మూడో అంతస్తుకు వెళ్లేందుకు ఆమె లిఫ్ట్ ఎక్కారు. ఆమెతో పాటు పరిమితికి మించిన సంఖ్యలో తొమ్మిది మంది లిఫ్ట్ ఎక్కడంతో సాంకేతిక లోపం తలెత్తి డోర్లు మూసుకుపోయి లిఫ్ట్ సెల్లార్‌లోకి వెళ్లింది. దీంతో ఎమ్మెల్యే పదిహేను నిమిషాల పాటు లిఫ్ట్​లో ఇరుక్కుపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది లిఫ్ట్ డోర్లు పగులగొట్టడంతో ఎమ్మెల్యేతో పాటు అందులో చిక్కుకున్న వారు సురక్షితంగా బయటకు వచ్చారు. ఎవరికీ ఎలాంటి హాని కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉండగా కంటోన్మెంట్​ ఎమ్మెల్యే సాయన్న ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. దాంతో ఆ స్థానంలో బీఆర్​ఎస్​ అధిష్ఠానం ఆయన కుమార్తె లాస్య నందితకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలిచారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.