Deer Ran Into Police Station : వీధికుక్కలకు భయపడి పోలీస్​ స్టేషన్​లోకి జింక పిల్ల పరుగు.. తర్వాత ఏమైందంటే..

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 4:56 PM IST

thumbnail

Deer Ran Into Police Station : కర్ణాటకలోని మైసూరు జిల్లా నంజగూడులో ఓ లేడి పిల్ల.. వీధికుక్కలకు భయపడి పోలీసు స్టేషన్​లోకి పరుగులు తీసింది. శునకాల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ జింకకు స్వల్పంగా గాయాలయ్యాయి. ఇది గమనించిన పోలీసులు జింకకు స్టేషన్​లోనే ఫస్ట్ ఎయిడ్ చేశారు. అనంతరం అటవీ శాఖ అధికారుల సాయంతో జింకను దగ్గర్లోని పశువైద్యశాలకు తరలించి చికిత్స అందించారు.

బారికేడ్​ను దూకి మరీ..
బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో నంజనగూడు పట్టణంలో ఏడాదిన్నర వయసున్న ఓ మగజింక పిల్ల తిరుగుతూ కనిపించింది. రోడ్డుపై ఉన్న జనాలు, వాహనాలను చూసిన జింక ఒక్కసారిగా భయాందోళనకు గురైంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కొన్ని వీధికుక్కలు ఆ లేడి కూనను వెంబడించాయి. దీంతో అది పరుగులు పెడుతూ నంజుండేశ్వరాలయం పక్కనే ఉన్న పోలీస్‌ స్టేషన్‌​లోకి పరుగులు పెట్టింది. ఆ సమయంలో స్టేషన్​ ఎదురుగా ఉన్న బారికేడ్​ను దూకి మరీ కుక్కల దాడి నుంచి తప్పించుకుంది. ఇది గమనించిన పోలీసులు గాయపడిన జింకకు ప్రథమ చికిత్స అందించారు. అయితే ఈ ఘటనలో జింకకు మూడు, నాలుగు చోట్ల స్వల్ప గాయాలయ్యాయని వారు తెలిపారు. ఫస్ట్​ ఎయిడ్​ అనంతరం దానిని అటవీ శాఖ అధికారుల సాయంతో దగ్గర్లోని పశువైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. మరో వారం రోజులపాటు లేడి పిల్లకు ప్రత్యేక పశువైద్యాధికారి పర్యవేక్షణలో చికిత్స చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.