ETV Bharat / sukhibhava

సంప్రదాయ చికిత్సతో స్థూలకాయానికి చెక్​

ఊబకాయం ఒక ఊబి లాంటిది. ఒక్కసారి అందులోకి జారిపోవడం మొదలైతే మన జీవితం అదుపు తప్పి ప్రమాదాల బాట పట్టినట్లే. స్థూలకాయం మొదలయ్యాక అడుగడుగునా సమస్యలు ఎదురవుతుంటాయి. గజానికో రుగ్మత, మైలుకో విపత్తు పలకరిస్తుంటాయి. అయితే దీనికి సంప్రదాయ పద్ధతుల్లో చెక్​ పెట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు. అదెలాగో చూద్దాం.

Check with traditional medicine for obesity
సంప్రదాయ చికిత్సతో స్థూలకాయానికి చెక్​!
author img

By

Published : Oct 12, 2020, 1:24 PM IST

సంప్రదాయ చికిత్సతో స్థూలకాయానికి చెక్​

ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం ఒకటి. ఇది హైబీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్లు, పక్షవాతం, కీళ్ల నొప్పులు... ఇలా ఒకటేమిటి ప్రమాదకర ఉపద్రవాలకు మోయలేని బరువనేది ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణంగా ఉంటోంది. అందుకే ఊబకాయాన్ని వ్యాధుల కుంపటిగా, జబ్బులకు రాచబాటగా పరిగణిస్తున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో కొండలాంటి స్థూలకాయాన్ని కరిగించేందుకు తనవైన ప్రత్యేక చికిత్సల్ని అందిస్తోంది రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్​నెస్ సెంటర్​.

వంద జబ్బులకు కారణం..

ఒకప్పుడు వేకువజామునే లేచేవాళ్లం. వేళకు తినేవాళ్లం. కాయకష్టం చేసేవాళ్లం. పెందలాడే నిద్రపోయేవాళ్లం. కానీ కాలం మారింది. నిద్రవేళలు, తిండివేళలు తారుమారయ్యాయి. టెక్నాలజీ రాకతో శారీరక కష్టం అటకెక్కింది. వీటికితోడు ఒత్తిళ్లు ఆందోళనలు పెరిగాయి. మొత్తంగా జీవనశైలి గందరగోళంగా తయారైంది. ఇలా జీవనశైలి దెబ్బతినడం వల్ల మానవాళికి వచ్చిపడ్డ అతి పెద్ద ఆరోగ్య ముప్పు స్థూలకాయం. దీని వల్ల వచ్చిన చిక్కేంటంటే... అది ఒక్కటే వంద రకాల జబ్బుల్ని తెచ్చిపెడుతుంది. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, థైరాయిడ్, కొన్ని రకాల క్యాన్సర్లు ఇలా స్థూలకాయం తెచ్చిపెట్టే జబ్బుల చిట్టా చెప్పుకుంటూపోతే అంతుండదు.

Check with traditional medicine for obesity
సంప్రదాయ చికిత్సతో స్థూలకాయానికి చెక్​

మొండిఘటం

అధిక బరువు తగ్గాలని రకరకాల డైటింగులు చేసేవాళ్లు, రకరకాల ఫిట్ నెస్ యాక్టివిటీలు చేసేవాళ్లు ఎందరో. అయితే, స్థూలకాయం ఓ మొండిఘటం. ఓ పట్టాన తగ్గేది కాదు. బరువు తగ్గడానికి ఎన్నో విధాల క్రమశిక్షణ అవసరం. ఆహారం, వ్యాయామం, ఒత్తిళ్లు ఇలా ప్రతి దానినీ క్రమబద్ధీకరించుకోవాలి. సంప్రదాయ పద్ధతిలో ఇలాంటి క్రమశిక్షణలతో స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి రామోజీ ఫిలింసిటీలోని సుఖీభవ వెల్ నెస్ సెంటర్ సహకరిస్తుంది.

"ఈ రోజుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కొందరు ఎక్కువగా తినేస్తారు. కొందరికేమో విపరీతమైన బద్ధకం వచ్చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో మేం చెప్పే మొదటి డీటాక్స్ ప్రక్రియ ఏమంటే... శరీరాన్ని, మనసును రెండింటినీ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. చురుగ్గా ఉంచుకోవాలి. ఈ రెండింటినీ చక్కగా ఉంచుకోవడం అన్నది చాలా ప్రధానమైంది. మొత్తం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి కూడా ఇది సహకరిస్తుంది. స్థూలకాయానికి సంబంధించి మన లక్ష్యాన్ని సాధించడం కోసం అది అవసరం. ఒబేసిటీ అన్నది కూడా ఓ అనారోగ్య సమస్యే. ఒబేసిటీలో ప్రధానంగా కనిపించే అతిగా తినేవాళ్లు, అలాగే బద్ధకంగా ఉండేవాళ్లు... వీరిద్దరికీ యోగిక్ వ్యాయామాలు మా దగ్గరున్నాయి.

వాటినెలా డిజైన్ చేశామంటే అవి స్థూలకాయాన్ని తగ్గించడంలో చక్కగా పనిచేస్తాయి. దాంతోపాటు ఆహార ప్రణాళిక కూడా ఉంటుంది. వీటితోపాటుగా ప్రకృతి వైద్యానికి సంబంధించిన హైడ్రోథెరపీని కూడా మేం వాడతాం. ఇది చెడు కణజాలాన్ని బ్రేక్ చేసి, తొలగించడంలో చక్కగా తోడ్పడుతుంది. ఆహారం, ప్రకృతి వైద్యం, యోగి వ్యాయామాలు వీటన్నింటినీ సమపాళ్లలో కలిపి స్థూలకాయాన్ని తగ్గించడానికి వాడతాం. సహజంగా బరువును తగ్గించడానికి మేం ప్రయత్నిస్తాం. దానివల్ల శరీరం కూడా సులభంగా అడ్జస్ట్ అవుతుంది. బరువు తగ్గేప్పుడు బ్యాలెన్స్ అన్నది చాలా ప్రధానం. ఏదో స్లిమ్ సెంటర్ మాదిరి హడావుడిగా ఏదో చేసేయడం కాకుండా, శరీరంలో మెటబాలిక్ రేటును పెంచి స్థూలకాయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాం. మెటబాలిజం రేటు బాగా ఉంటే బరువు తగ్గడం సులభమవుతుంది."

- డాక్టర్ అర్చన, సుఖీభవ వెల్​నెస్​ సెంటర్​ డైరెక్టర్

ఆయుర్వేద వైద్యంతో అధిక బరువుకు చెక్​

అధిక బరువు అనేది ఓ ఊబి లాంటిది. ఓసారి అందులో దిగబడితే బయటపడడం అంత సులభం కాదు. తినే తిండి, చేసే వ్యాయామం, నిద్ర, ఒత్తిళ్లు ఇలా ఎన్నో కారణాలు కలగలసి స్థూలకాయాన్ని తెచ్చిపెడతాయి. గజిబిజిగా తయారైన జీవనశైలిని చక్కదిద్దుకుంటే మెల్లగానైనా బరువు తగ్గుతాం. కానీ చాలామంది వెంటనే బరువు తగ్గాలని చెప్పి క్రాష్ డైటింగులనో, విపరీతమైన వ్యాయామాలనో, లేదంటే లైపోసక్షన్, బేరియాట్రిక్ విధానాల్ని ఆశ్రయిస్తుంటారు. వీటన్నింటి వల్ల కూడా అనేక అనర్థాలు లేకపోలేదు. కాస్త మెల్లగానైనా సంప్రదాయ చికిత్సలతో తినే ఆహారాన్ని, వ్యాయామాన్ని, నిద్రను, ఆందోళలనలను చక్కదిద్దుకుని సహజసిద్ధంగా బరువు తగ్గే మార్గాలు మనకు ఉండనే ఉన్నాయి. కాకపోతే ఒకటి రెండు నెలలు ఎక్కువ సమయం పట్టొచ్చు. అయితే ఫలితం భేషుగ్గా ఉంటుంది. ఆయుర్వేదం, ప్రకృతివైద్యం, యోగా విధానాలు అందించిన పద్ధతులతో స్థూలకాయాన్ని తగ్గించుకోవచ్చు.

సంప్రదాయ పద్ధతుల్లో...

స్థూలకాయం అనేది ప్రస్తుతం ఆరోగ్య విపత్తు అనే చెప్పాలి. నిజానికీ ఆరోగ్య విపత్తు ఒక్క రోజులో వచ్చిపడేది కాదు. దానిని తగ్గించకోవడానికి తాత్కాలిక పద్ధతుల్ని కాకుండా శాశ్వత ఫలితాల్నిచ్చే సంప్రదాయ విధానాల్ని ఆశ్రయించడం మంచిది. ప్రకృతి వైద్యాన్ని, ఆయుర్వేద వైద్యాన్ని, యోగాల సమ్మిశ్రమంగా స్థూలకాయాన్ని తగ్గించే మార్గాల్ని సుఖీభవ వెల్ నెస్ సెంటర్ ఇప్పుడందిస్తోంది.

సంప్రదాయ చికిత్సలతో పాటు, ఆహారమే ఔషధంగా స్థూలకాయానికి చికిత్స చేయడం సుఖీభవ వెల్​నెస్ సెంటర్ ప్రత్యేకత. యోగ, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యాల దన్నుగా ఇక్కడి నిపుణులు అందించే చికిత్సలు, పరిష్కార మార్గాల సాయంతో స్థూలకాయాన్ని మనం చక్కగా తగ్గించుకోవచ్చు.

Check with traditional medicine for obesity
సంప్రదాయ చికిత్సతో స్థూలకాయానికి చెక్​!

ఇదీ చూడండి: కొవిడ్​-19 నుంచి కోలుకున్నాక ఈ వ్యాయామాలు పాటించండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.