ETV Bharat / state

భువనగిరిలో ఆర్టీపీసీఆర్​ పరీక్ష కేంద్రం ప్రారంభం

author img

By

Published : Apr 28, 2021, 5:55 PM IST

కరోనా నిర్ధరణలో కీలకమైన ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష కేంద్రాన్ని... భువనగిరి పట్టణంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లాలో కేవలం బీబీనగర్‌ ఎయిమ్స్‌లో మాత్రమే ఈ సేవలు ఉండగా... నేటి నుంచి భువనగిరిలోనూ అందుబాటులోకి వచ్చాయి.

Opening of RT PCR Test Center at bhuvanagiri town
భువనగిరిలో ఆర్టీపీసీఆర్​ సేవలు ప్రారంభం

యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో కొవిడ్​ నిర్ధరణలో కీలకమైన ఆర్టీపీసీఆర్​ పరీక్ష కేంద్రాన్ని... ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​ రెడ్డి ప్రారంభించారు. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో మాత్రమే ఈ సేవలు ఉండగా... నేటి నుంచి భువనగిరిలోనూ అందుబాటులోకి వచ్చాయి.

Opening of RT PCR Test Center at bhuvanagiri town
భువనగిరిలో ఆర్టీపీసీఆర్​ సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​ రెడ్డి

ఎయిమ్స్​లో నమూనాలు సేకరించి అక్కడే పరీక్షలు కూడా చేసేందుకు యంత్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ బాధితుల తాకిడి పెరగడంతో... నమూనాల సేకరణకు భువనగిరికి మార్చినట్లు జిల్లా వైద్యాధికారి సాంబశివరావు తెలిపారు. పట్టణ పరిసర ప్రాంతాల్లోని వైరస్ అనుమానితులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ఇదీ చదవండి: అంతర్​రాష్ట్ర ముఠాపై పీడీ యాక్ట్​ నమోదు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.