ETV Bharat / state

భువనగిరిలో ఘనంగా హనుమాన్ జయంతి

భువనగిరిలో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. పట్టణంలో కాషాయ జెండాలతో భక్తులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.

author img

By

Published : Apr 19, 2019, 7:36 PM IST

హనుమాన్ జయంతి

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ఎటుచూసినా కాషాయ జెండాలు రెపరెపలాడాయి. హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం హైదరాబాద్ చౌరస్తా నుంచి ప్రారంభమైన హనుమాన్ ర్యాలీ ప్రధాన వీధుల గుండా కొనసాగుతూ అంజనాద్రి నగర్ వరకు సాగింది. అనంతరం అంజన్న స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ర్యాలీలో పాల్గొన్న భక్తుల కోసం మజ్జిగ, చల్లటి మంచినీరు నిర్వాహకులు అందుబాటులో ఉంచారు.

హనుమాన్ జయంతి

ఇవీ చూడండి: మండువేసవిలో... కూరగాయల మంట

Intro:TG_NLG_62_19_HANUMANBYKERALLY_AV_C14

యాంకర్ : హనుమాన్ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో హనుమాన్ భక్తులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భువనగిరి పరిసర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. పట్టణంలో ఎటుచూసినా కాషాయ జెండా లు రెపరెపలాడాయి. హనుమాన్ దేవాలయం లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హైదరాబాద్ చౌరస్తా నుంచి ప్రారంభమైన హనుమాన్ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగుతూ జగదేవ్ పూర్ రోడ్డులోని అంజనాద్రి నగర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

Body:ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల బైక్ ర్యాలీ లో పాల్గొన్న భక్తుల కోసం వినాయక్ చౌరస్తా వద్ద మజ్జిగ చల్లటి మంచినీరు నిర్వాహకులు అందుబాటులోఉంచారు. అదేవిధంగా పట్టణంలోని కోర్ట్ ముందు ర్యాలీ లో పాల్గొన్న హనుమాన్ భక్తులకు ముస్లిం యువకులు మజ్జిగ, చల్లని మంచినీరు ను అందించారు. మత సామరస్యాన్ని చాటారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.