ETV Bharat / state

ఆధ్యాత్మిక నగరిగా... యాదాద్రి దివ్యక్షేత్రం నిర్మాణం - yadadri lakshmi narasimha swamy temple

తెలంగాణ తిరుపతిగా పిలుచుకునే యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయ పునర్నిర్మాణానికి ఐదేళ్ల కింద బీజం పడింది. అద్భుత శిల్పాలతో.. ఆధ్యాత్మిక నగరి నిర్మాణ ఆలోచనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి అడుగు వేయించారు.  ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆధార శిల నుంచి శిఖరం వరకు..  దేవుళ్ల ప్రతిమలకు ఉపయోగించే కృష్ణ శిలనే వినియోగించేలా రూపకల్పన చేశారు. వెయ్యేళ్లు వర్ధిల్లే అద్భుత ఆలోచనలకు ప్రతిరూపంగానే  ప్రస్తుత ఆలయ నిర్మాణం పూర్తి కావస్తోంది.  శిఖరాల పనులు పూర్తికాగా, సప్త మహా రాజ గోపురం చెంత వేంచేపు మండప పనులు తుది దశకు చేరాయి. ఆలయంతో పాటు అద్భుతమైన రహదారులతో టెంపుల్ సిటీ ఏర్పాటు కానుంది...

ఆధ్యాత్మిక నగరిగా... యాదాద్రి దివ్యక్షేత్రం నిర్మాణం
author img

By

Published : Nov 10, 2019, 5:13 AM IST

Updated : Nov 10, 2019, 8:28 AM IST

ఆధ్యాత్మిక నగరిగా... యాదాద్రి దివ్యక్షేత్రం నిర్మాణం

భాగ్యనగరానికి చేరువలో భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోన్న ఆలయాన్ని అద్భుతమైన దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేయడానికి తొలి అడుగు పడి సరిగ్గా నేటికి అర్ధ దశాబ్దం అవుతోంది. రెండు వేల ఎకరాల్లో ఆధ్యాత్మికంగా ఆహ్లాదకరంగా అన్ని హంగులతో... అంతర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుమల స్థాయిలో అభివృద్ధి చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం.. ఈ ఐదేళ్లలో ఆలయ రూపురేఖలనే మార్చివేసింది.

ఆధారశిల నుంచి శిఖరం వరకు

  • రాజుల కాలంనాటి అద్భుతమైన శిల్ప కళా నైపుణ్యం.. ఆధార శిల నుంచి శిఖరం వరకు కృష్ణ రాతిశిలా నిర్మాణాలు... దేశంలో... ఎక్కడా లేనివిధంగా అష్టభుజి ప్రాకార మండపాలు, సప్త గోపుర సముదాయం, భాగవత పురాణ ఇతిహాసాలు, మహా పురుషులు, దేవతామూర్తుల విగ్రహాలు, రాతి స్తంభాల ముఖ మండపాలు, పాంచ నరసింహులు కొలువై ఉన్న కొండ గుహ గర్భాలయం.. దాని ముఖ ద్వారానికి ప్రహ్లాద చరితం... పాంచ నరసింహుల రాతి బొమ్మలతో అనేక విశేషాల మేళవింపుతో పనులు తుది దశకు చేరుకున్నాయి.

బీజం అక్కడే పడింది

తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి హోదాలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని 2014 అక్టోబర్ 17న తొలిసారి సందర్శించారు కేసీఆర్. సాధారణంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారని అందరూ భావించారు కానీ హెలికాప్టర్​లో యాదాద్రి ఆలయ పరిసరాల్లోని కొండలు.. గుట్టలను పరిశీలించిన ఆయన... అప్పుడే యాదాద్రి ఆలయాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయాలని సంకల్పించారు.

టెంపుల్ సిటీగా...

యాదగిరి క్షేత్రాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయాలని యాదగిరి కొండ చుట్టూ గల ఇతర కొండలు, చెరువులతో పాటు ప్రభుత్వ ప్రైవేటు భూములను సుమారు 2వేల ఎకరాలను సేకరించాలని అప్పటి జిల్లా కలెక్టర్ చిరంజీవులును ఆదేశించారు. రెండు వేల ఎకరాలలో నాలుగు వందల ఎకరాలు జింకల పార్కు అభివృద్ధికి, మిగిలిన స్థలంలో వేద పాఠశాల సాంస్కృతిక విద్యా పీఠం భవనంతో పాటు తిరుమల స్థాయిలో ల్యాండ్ స్కేప్ గార్డెన్​లు, బహుళ అంతస్తుల వసతి గృహాలను అభివృద్ధి చేయాలని సంకల్పించారు.

ఆధ్యాత్మిక విరాజిల్లే విధంగా

యాదగిరి కొండపై గల 14.11 ఎకరాలు ఆలయ విస్తరణకు, కొండను ఆవరించి ఉన్న 103 ఎకరాలను ల్యాండ్ స్కేప్ గార్డెన్​లుగా అభివృద్ధికి వినియోగించాలని నిర్ణయించారు. కొండపై ఆలయ మండప విస్తరణ, గోపురాల పరిస్థితి, వసతి పార్కింగ్ అంశాలను దేవాదాయ శాఖ ఆమోదించిన మాస్టర్ ప్లాన్​ను కేసీఆర్​ పరిశీలించారు. యాదాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మికత విరాజిల్లే విధంగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకున్నారు.

11 సార్లు ఆలయ సందర్శన

ఆలయ అభివృద్ధి విస్తరణ, చేపట్టాల్సిన ప్రతి నిర్మాణ ప్రణాళికలను స్వీయ పరిశీలనలో రూపకల్పన చేశారు. దాదాపు పాతిక పర్యాయాలు అధికారులతో సమీక్షలు, 11 సార్లు ఆలయాన్ని స్వయంగా సందర్శించిన సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో మహిమాన్విత యాదాద్రి క్షేత్రం దేశంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైన రాతి శిల్ప నిర్మాణ ఆలయంగా రూపుదిద్దుకునే పనులు తుదిదశకు చేరుకున్నాయి..

కృష్ణ రాతి శిల సొబగులు...

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ విస్తరణ ప్రాకారం నిర్మాణాలు కాకతీయుల శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడుతూ అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. ఆధార శిల నుంచి శిఖరం వరకు పూర్తిగా కృష్ణ రాతి శిలలతో ప్రధానాలయం, అంతర్ బాహ్య ప్రాకార మండపాలు, సప్త గోపుర సముదాయాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రధాన ఆలయం పడమటి పంచతల రాజగోపురం ఎదుట విజయోత్సవ మండపం పూర్తి కాగా సప్త తల మహా రాజగోపురం చెంత వేంచేపు మండపం తుది దశ పనులు కొనసాగుతున్నాయి.

ఆలయ విశిష్టత

ప్రధాన ఆలయ ప్రాకార మండపాలు అష్టభుజి ఆకృతిలో నిర్మించడం ఇక్కడి విశేషం. కృష్ణ రాతి శిలలతో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో యాళీ పిల్లర్లు, సింహం శిల్పాలు, కాకతీయ శిల్ప కళా నైపుణ్యంతో రాజుల కాలంనాటి శిల్పకళా ఖండాలకు వెయ్యి మందికి పైగా శిల్పులు జీవం పోశారు. కొండపైన అనుబంధ ఆలయంగా కొనసాగుతున్న పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం, స్వామివారి విష్ణు పుష్కరిణి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి.

ఆహ్లాదకరమైన ఆలయ పరిసరాలు...

యాదాద్రి కొండ చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించి ఆలయాన్ని దక్షిణ పడమర వైపు విస్తరించారు. కొండకు దిగువన ఘాట్ రోడ్ల వెంట ల్యాండ్ స్కేపింగ్ గార్డెన్​లు అభివృద్ధి చేశారు. భక్తులు గిరి ప్రదక్షిణ చేయడానికి కొండ చుట్టూ గిరిప్రదక్షిణ రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయి.

ఆధునిక సదుపాయాలతో టెంపుల్ సిటీ...

యాదాద్రి కొండకు అభిముఖంగా ఉన్న పెద్ద గుట్టలో టెంపుల్ సిటీ లేఔట్ అభివృద్ధి చేశారు. 250 ఎకరాల్లో భక్తులకు అంతర్జాతీయ వసతులతో విల్లాలు అతిథి గృహ నిర్మాణం కోసం సుమారు రూ.207 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. ఆహ్లాదం కలిగించే ఆధ్యాత్మిక నగరిగా విశాలమైన రహదారులు నీటి సదుపాయం కోసం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, పచ్చదనం కోసం ఉద్యానవనాలు రూపకల్పన చేశారు.

వీవీఐపీ ప్రెసిడెన్షియల్​ సూట్

ఈ టెంపుల్ సిటీలో స్థలాలను దాతలకు కేటాయించి అత్యాధునిక వసతి సముదాయాలు భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు బసచేయడానికి వీవీఐపీ ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణం చేపడుతున్నారు. కొండ కింద గండి చెరువు సమీపంలో మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి, కొండ చుట్టూ 165 అడుగుల వెడల్పులో ఆరు లైన్ల రింగురోడ్డు నిర్మాణాలను ముసాయిదా డిజైన్లు రూపొందించిన వైటీడీఏ అధికారులు భూసేకరణ చేస్తున్నారు.

మినీ శిల్పారామం

యాదగిరి కొండకు విచ్చేసే భక్తులకు ఆధ్యాత్మికతో పాటు ఆహ్లాదాన్ని కలిగించేందుకు కొండకింద తులసి తోటలో సుమారు ఎకరం విస్తీర్ణంలో మినీ శిల్పారామం నిర్మిస్తున్నారు. జలవిహారం చేసేందుకు బోటింగ్ సదుపాయాలు కల్పిస్తున్నారు.

అప్పుడే ప్రారంభం

ఐదేళ్ల క్రితం ఆలయ సందర్శనకు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. యాదాద్రి ఆలయాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయాలన్న మహా సంకల్పం తుది దశకు చేరుకుంది. ఈ ఏడాది డిసెంబర్ చివరి కల్లా పూర్తి కానుంది. వైదిక ఆగమ శాస్త్రానుసారం ఆలయ నిర్మాణంలో ఏమైనా దోషాలు ఏర్పడితే వాటిని గుర్తించి సవరణలు చేపట్టి 2020 ఫాల్గుణ మాసంలో శ్రీ మహా సుదర్శన యాగంతో గర్భాలయంలో స్వయంబు పంచ నారసింహ దర్శనాలు కల్పించే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.

Intro:Tg_nlg_185_09__yadadri_temple_pkg_TS10134Body:Tg_nlg_185_09__yadadri_temple_pkg_TS10134Conclusion:Tg_nlg_185_09__yadadri_temple_pkg_TS10134

వార్త పూర్తిగా మోజో కిట్. 789 ...చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630 ద్వారా పంపటం జరిగింది.
పరిశీలించగలరు.....

Last Updated : Nov 10, 2019, 8:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.