ETV Bharat / state

ఆసుపత్రికి లక్ష రూపాయల విలువైన సామగ్రి పంపిణీ

రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ సహకారంతో గైల్ కంపెనీ దాదాపు... లక్ష రూపాయల విలువైన సామగ్రిని యాదాద్రి జిల్లా రాజపేటలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్, రాష్ట్ర సహకార బ్యాంకు వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పీహెచ్​సీ ఆవరణలో మొక్కలు నాటి రోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

rajapet hospital yadadri district
ఆసుపత్రికి లక్ష రూపాయల విలువైన సామగ్రి పంపిణీ
author img

By

Published : Jun 5, 2021, 8:16 PM IST

యాదాద్రి జిల్లా రాజపేటలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ సౌజన్యంతో గైల్ కంపెనీ సుమారు లక్ష రూపాయల విలువైన సామగ్రిని అందజేశారు. ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లు, స్టాండ్, స్ట్రేచర్, వీల్ చైర్లను ఆసుపత్రికి పంపిణీ చేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్, రాష్ట్ర సహకార బ్యాంకు వైస్ ఛైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి పీహెచ్​సీ ఆవరణలో మొక్కలు నాటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగుల ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నియోజకవర్గంలోని రెండు గ్రామీణ ప్రాంత ఆరోగ్య కేంద్రాలకు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్… వైద్య పరికరాలు అందించడం హర్షించదగిన విషయమని గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ధాన్యం కొనుగోలులో రాష్ట్రంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా ముందంజలో ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: TS corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,070 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.