ETV Bharat / state

పర్వతారోహణ కల... సాకారం చేస్తున్న భువనగిరి ఖిల్లా...

ఎత్తైన కొండల్ని చూస్తేనే గుండెలదురుతాయి. ఇక పర్వతాలు అధిరోహించాలంటే మాటలా... మానసిక పటుత్వం, శారీరక దృఢత్వం కలగలిస్తేనే... శిఖరాలు ఎక్కగలరు. పాఠశాల విద్యార్థులు పూర్ణ, ఆనంద్ సృష్టించిన చరిత్రతో... ఎంతో మంది ఇప్పుడు శిఖరాల అధిరోహణపై మనసు లగ్నం చేస్తున్నారు. అలాంటి వారికి అన్ని విధాలుగా శిక్షణ ఇస్తోంది... భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్.

పర్వతారోహణ కల... సాకారం చేస్తున్న భువనగిరి ఖిల్లా...
author img

By

Published : Nov 11, 2019, 5:08 AM IST

Updated : Nov 11, 2019, 10:59 AM IST

పర్వతారోహకుల కల... సాకారం చేస్తున్న భువనగిరి ఖిల్లా...

మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు... ఎముకలు కొరికే చలి. ఏ మాత్రం పట్టు తప్పినా అంతే సంగతి. అడుగు తీసి అడుగేసుకుంటూ కిలోమీటర్ల కొద్దీ సాగే... సాహస యాత్ర. సాహస యాత్ర అనే బదులు... ప్రమాదకర యాత్ర అంటే సబబేమో. అలాంటి సాహసోపేత యాత్రకు ఏటా వందల మందిని పంపిస్తోంది రాక్​ క్లైంబింగ్​ శిక్షణ పాఠశాల.

ఏకశిలే కారణం

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోనే రాక్ క్లైంబింగ్ స్కూల్ ఏర్పడటానికి ప్రధాన కారణం... ప్రసిద్ధిగాంచిన ఖిల్లా అందుబాటులో ఉండటమే. మోనోలిథిక్... అంటే ఒకే శిలగా ఏర్పడిన రాయి అందుబాటులో ఉండటం వల్ల... పర్వతారోహణ శిక్షణకు అనువుగా ఉంటుంది. ఏటా వందలాది మందికి పర్వతారోహణలో శిక్షణనిస్తున్న భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్... 2013 సెప్టెంబరు 6న ప్రారంభమైంది. ఇప్పటివరకు ఈ స్కూల్​లో 8 వేల మందికి శిక్షణనివ్వగా... అందులో 4 వందల మంది ప్రపంచంలోని ముఖ్యమైన పర్వతాలను అధిరోహించారు.

ఎవరెస్టు 90, కిలిమంజారో 260

  • ఎవరెస్టును 90 మంది, కిలిమంజారో పర్వతాన్ని 260 మంది, యూరప్ లోని ఎల్ బ్రూస్ శిఖరాన్ని59 మంది, అమెరికాలోని మౌంట్ అకాంగాగోవాను 12 మంది, ఆస్ట్రేలియాలోని మౌంట్ క్రిజిస్కో పర్వతాన్ని 20 మంది, ఉత్తర అమెరికాలోని మౌంట్ దెనాలీ పర్వతాన్ని ఇద్దరు వ్యక్తులు చేరుకున్నారు. మాలావత్ పూర్ణ, ఆనంద్ సైతం... తొలుత ప్రాథమిక స్థాయిలో భువనగిరిలోనే తర్ఫీదు పొందారు.

ట్రెక్కింగ్​ పార్యడైజ్

పర్వతారోహుకులు ట్రెక్కింగ్ ప్యారడైజ్​గా... భువనగిరి ఖిల్లాను అభివర్ణిస్తున్నారు. ఎవరెస్టును అధిరోహించాలన్నది... ఎంతో మంది కల. ఆ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు... సరిగ్గా అలాంటి పరిస్థితులుండే భువనగిరి కోటనే సాహసీకులు ఎంచుకుంటున్నారు. ఇక్కడి రాక్ క్లైంబింగ్ స్కూల్లో... ప్రాథమిక శిక్షణ అందిస్తున్నారు.

దేశ నలుమూలల నుంచి

8 ఏళ్ల నుంచి 70 సంవత్సరాల వయసు గలవారు సైతం... ఈ కోట వద్ద తర్ఫీదు పొందుతున్నారు. ఈ శిక్షణ కేంద్రం వ్యవస్థాపకుడు బచినేపల్లి శేఖర్ బాబు ఆధ్వర్యంలో... 22 మంది శిక్షకులు అందుబాటులో ఉంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి... శిక్షణ కోసం భువనగిరి ఖిల్లాకు వస్తుంటారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పాఠశాలలు, కళాశాలల నుంచి సైతం... నెల నెలా విద్యార్థులు బృందాలుగా ఇక్కడకు చేరుకుని ఓనమాలు నేర్చుకుంటారు. ప్రాథమిక స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని... హిమాలయాలు, డార్జిలింగ్ వంటి ప్రాంతాలకు పంపుతుంటారు.

సాహసవీరులకు సరైన కోర్సులు

సాహసయాత్రలకు ఆసక్తి చూపే వారికి తొలుత... 3 రోజులు, 5 రోజుల కోర్సులు అమలు చేస్తారు. ఆత్మవిశ్వాసం ప్రోది చేసే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ సెషన్ తోపాటు రాయి మీద, ఎగుడు దిగుళ్ల మీద ఎలా నడవాలన్న దానిపై శిక్షణనిస్తారు. అధిరోహణ మెలకువలతోపాటు వాడాల్సిన పరికరాలపై అవగాహన కల్పిస్తారు. ఇందుకు ఐదు దశల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

ఇందులో 2 క్లైంబింగ్ టెస్టులు, ఒకటి గేర్ టెస్ట్, మరోటి నాట్స్ టెస్ట్ చేపడతారు. ఈ ఐదు రోజుల్లో నేర్చుకున్న అంశాలపై చివరగా... రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎవరెస్టు వంటి శిఖరాల పర్వతారోహణకు కావాల్సిన ట్రెక్కింగ్, హైకింగ్, లోడ్ ఫెర్రింగ్, క్లైంబింగ్ వంటి అంశాలపై... భువనగిరి కోట వద్ద పూర్తిస్థాయిలో అభ్యాసం సాగుతోంది.

అవలీలగా అధిరోహణ

ఎవరెస్టు, ఎల్ బ్రూస్, కిలిమంజారో, అకాంగాగోవా వంటి పర్వతాల్ని... ఇక్కడి విద్యార్థులు అవలీలగా అధిరోహించారు. కొంతమందైతే ఈ నాలుగు పర్వతాలను చేరుకుని... భారత పతాకని రెపరెపలాడించారు. మరో మూడు శిఖరాల్ని అధిరోహించి... ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఏడు పర్వతాల్ని చేరుకున్న ఘనతను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు.

ఇదే శిక్షణా ప్రక్రియ

  1. ఐదు రోజుల శిక్షణలో తొలి రోజు నాడు... ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, ధైర్యం నూరిపోస్తారు. పర్వతాలు ఎక్కే సమయంలో ఎలాంటి సమతూకం పాటించాలన్న దానిపై... అవగాహన కల్పిస్తారు.
  2. రెండో రోజు నాడు బోల్డ్రింగ్ అంటే పెద్ద రాయిపైకి... కింద నుంచి ఎలా చేరుకోవాలో నేర్పిస్తారు. అలాంటి సమయంలో శిలల రూపాలపై అవగాహన నిర్వహిస్తారు. ఎలాంటి శిలను అధిరోహించడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి కొండలకు దూరంగా ఉండాలన్న దానిపై తర్ఫీదు జరుగుతుంది. అలా శిలల తత్త్వాన్ని తెలియజేస్తూనే... ఎక్కే క్రమంలో శరీర సాధన ఎలా ఉండాలన్న అంశాల్ని వివరిస్తారు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎలా అమలు చేయాలన్నది సూచిస్తారు.
  3. మూడో రోజు నాడు వంద అడుగుల ఎత్తులో ర్యాప్లింగ్... అంటే పై నుంచి కిందకు దిగడం వంటివి తెలియజేస్తారు. 45, 65, 75 డిగ్రీల కోణంలో గల రాతి కొండల్ని... ఎలా ఎక్కాలో సాంకేతిక శిక్షణ అందిస్తారు.
  4. నాలుగో రోజునాడు సైతం మూడో రోజు జరిగే కార్యక్రమాల్నే తిరిగి చేయిస్తారు.
  5. ఐదో రోజు నాడు... 90 డిగ్రీల కోణంలో రాయిపైకి ఏ విధంగా ఎక్కి, దిగాలన్న దానిపై సునిశిత రీతిలో బోధన చేపడతారు.

ఈ ఐదు రోజుల కోర్సు పూర్తి కాగానే... ధ్రువపత్రం ప్రదానం చేస్తారు.

అనుకూలతలు

పర్వతారోహణకు దేశంలో ఏ ప్రాంతంలో లేని అనుకూలతలు... భువనగిరి ఖిల్లాకున్నాయి. ఇది ఏకశిలా పర్వతం కాగా... కోటను వివిధ కోణాల్లో చుట్టి వచ్చే సౌలభ్యం ఉంది. కోట పరిసర ప్రాంతాల్లో శిక్షణకు అనువుగా... సెడిమెంట్ రాక్, మెటామాఫిక్, ఇగ్నోస్ రాక్​లున్నట్లు... ఎవరెస్టును అధిరోహించిన వారు తెలియజేస్తున్నారు.

పర్వతారోహణ ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులతోపాటు... కొండలు ఎక్కేందుకు వినియోగించే సామగ్రి... తాడు, క్యారబినర్, డిసెండర్, హర్నేస్, శిరస్త్రాణం, బూట్ల వంటి వాటిపై అవగాహన ఏర్పరుస్తారు. ఇలా పర్వతారోహణపై ఆసక్తి గలవారికి... భువనగిరి ఖిల్లా ప్రత్యేక శిక్షణా కేంద్రంగా మారింది.

sample description
Last Updated : Nov 11, 2019, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.