కరోనా నిబంధనలు బేఖాతరు చేస్తూ.. ఓరుగల్లు నగరంలో తెరాస అభ్యర్థి సన్నాహక సమావేశాలు నిర్వహించారు. సుశీల గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో భౌతిక దూరం పాటించకపోవడం గమనార్హం. ఇది ఇలా ఉంటే.. సభకు ఎలాంటి అనుమతులు లేకుండానే 29వ డివిజన్‌కు చెందిన తెరాస అభ్యర్థి గుండు సుధారాణి సభను నిర్వహించడం అనే విమర్శలకు దారి తీసింది.

కొవిడ్ ఉద్ధృతి దృశ్య ఎన్నికల్లో సభలకు, సమావేశాలకు అనుమతి లేదని ఎన్నికల అధికారులు తెలిపారు. అనుమతి లేకుండా నిర్వహించడంపై స్పెషల్ ఆఫీసర్ కేసు నమోదు చేశారు.
ఇవీచూడండి: పుర ఎన్నికల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ