వరంగల్ గ్రామీణ జిల్లాను డట్టమైన పొగ మంచు కమ్మేసింది. ఉదయం తొమ్మిదయినా మంచు తేరుకోలేదు. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై దట్టంగా కమ్ముకోవటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పంటపొలాల్లో తీవ్రత ఎక్కువగా ఉండడంతో రైతులు పనులకు వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. పుష్యమాస వేల చూపరులను ఆకట్టుకోగా మంచు ప్రభావం ఎక్కువున్న ప్రాంతాల్లో వాహనదారులు స్వీయచిత్రాలు తీసుకుని ప్రకృతిని ఆస్వాదించారు.
జిల్లా పరిధిలోని వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి, మండలాల్లో దట్టమైన పొగమంచు చూపరులను కనివిందు చేసింది. హిమాలయాల్లోని వాతావరణాన్ని తలపించింది.
ఇదీ చూడండి: 'నమ్ముకున్న పొలమే కాటేసిందానే.. అన్న'