ETV Bharat / state

'జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం'

author img

By

Published : Jan 9, 2021, 6:14 PM IST

వికారాబాద్ జిల్లాలోని సాయిబాబా అగ్రోటెక్ పత్తి జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని మాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పినట్లు యాజమాన్యం తెలిపింది.

a-fire-broke-out-at-saibaba-agrotech-cotton-ginning-mill-near-pudur-zone-in-vikarabad-district
వికారాబాద్ : జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం

వికారాబాద్ జిల్లా పూడూర్ మండల కేంద్రంలోని సాయిబాబా అగ్రోటెక్ పత్తి జిన్నింగ్ మిల్లులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మిల్లులో పనిచేస్తున్న సమయంలో షాక్​ సర్క్యూట్​ కారణంగా ట్రాక్టర్​లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

చాకచక్యంగా ..

వాటిని అదుపు చేసే క్రమంలో నిప్పు రవ్వలు పత్తికి అంటుకుని స్వల్పంగా కాలిపోయింది. అగ్ని మాపక సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించటంతో కోట్ల విలువ చేసే పత్తి కాలిపోకుండా కాపాడగలిగారు. ఈ ప్రమాదంలో సుమారుగా ఐదు లక్షల వరకు నష్టపోయినట్లు జిన్నింగ్ మిల్లు యాజమాన్యం తెలిపింది.

ఇదీ చదవండి: భౌగోళిక గుర్తింపు ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించిన గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.