ETV Bharat / state

'సున్నపురాయి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోండి'

సున్నపురాయి అక్రమ తవ్వకాలు, రవాణాపై చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా రఘునాధపాలెం గ్రామస్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బ్లాస్టింగ్​ల వల్ల తమ ఇళ్లు, ఆస్తులు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By

Published : Jul 11, 2019, 5:16 AM IST

Updated : Jul 11, 2019, 7:54 AM IST

'సున్నపురాయి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోండి
'సున్నపురాయి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోండి'

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుండ్లపల్లి, రఘునాధపాలెంలో సున్నపురాయి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. 318, 258, 16 సర్వే నెంబర్లు గల ప్రభుత్వ భూమిలో అధికార పార్టీకి చెందిన కొందరు అక్రమ మైనింగ్​కు​ పాల్పడుతున్నారంటూ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ అనుమతుల్లేకుండా బ్లాస్టింగ్​లకు పాల్పడుతున్నారని, సమీపంలోని ఇళ్లు దెబ్బతింటున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. చర్యలు తీసుకోవాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయంతో గడుపుతున్నామని వాపోయారు.

అక్రమ తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామన్న కోపంతో దళారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు. ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు లేకుండా అక్రమంగా సున్నపురాయిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రఘునాధపాలెం గ్రామం సమీపంలో సున్నపురాయి అక్రమ తవ్వకాల వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని ఆర్​ఐ బలరాం నాయక్​ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని. తన ఇళ్లు, ఆస్తులను కాపాడాలని రఘునాధపాలెం గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి: దొంగల ముఠాను అరెస్ట్​ చేసిన సీసీఎస్​ పోలీసులు

Intro:Body:Conclusion:
Last Updated : Jul 11, 2019, 7:54 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.