కొవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మండల కేంద్రంలోని ఓ శిక్షణా కేంద్రాన్ని మండల విద్యాశాఖ అధికారి చత్రు నాయక్ సీజ్ చేశారు. నవోదయ,గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నెల రోజుల పాటు శిక్షణ ఇస్తామని నిర్వాహకులు ప్రకటించడంతో విద్యార్థులు క్లాసులకు హాజరయ్యారని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆంక్షలను ఉల్లంఘించి శిక్షణ తరగతులు నిర్వహిస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చత్రు నాయక్ హెచ్చరించారు.
ఇదీ చదవండీ : డయల్-100కు కొత్త హంగులు.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు