ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో మొక్కల పెంపకం, రక్షణను బాధ్యతగా తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాదారం నుంచి కోదాడ మండలం నల్లబండగూడెం వరకు జాతీయ రహదారి పక్కన నాటిన హరితహారం మొక్కలను పరిశీలించారు.
పశువులు తినకుండా ప్రతి మొక్కకి కంచె ఏర్పాటు చేయాలని సూచించారు. హారితహారం మొక్కల సంరక్షణ విషయంలో జిల్లా పాలనాధికారి వినయ్ కృష్ణారెడ్డిని ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ప్రశంసించారు.
ఇదీ చూడండి: ప్రభుత్వం ఆదుకోవాలని.. ప్రైవేట్ టీచర్ల ర్యాలీ