ETV Bharat / state

దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న పసివాడు

author img

By

Published : Jan 30, 2021, 6:23 AM IST

రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలో విద్యుదాఘాతం పెను విషాదాన్ని నింపింది. అప్పటి వరకు కళ్లముందు అల్లరి చేస్తూ ఆటలాడిన ఆ చిన్నోడిని అవిటివాన్ని చేసింది. అయినా బతకాలనుకున్న ఆ బాలుడికి పేదరికం శాపంగా మారింది. కొడుకుకు మెరుగైన వైద్యం అందించడానికి డబ్బుల్లేక దాతల సహాయం కోసం అర్థిస్తున్న నిరుపేద తల్లిదండ్రుల దీనస్థితిపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న పసివాడు
దాతల సాయం కోసం ఎదురు చూస్తున్న పసివాడు

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన బాబు-మమత దంపతుల కుమారుడు చంటి. గత నెల 23న ఎనిమిదేళ్ల చంటి స్నేహితులతో ఆడుకుంటూ ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి ఎక్కి... విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని తొలుత కోదాడ తర్వాత ఖమ్మం ఆస్పత్రికి తరలించినా పట్టించకోకపోవటంతో వరంగల్‌కు తీసుకెళ్లారు.

చెత్తకుప్ప పోయడం వల్లే ప్రమాదం

ప్రమాదంలో ఎడమ చేయి పూర్తిగా దెబ్బతినటంతో వైద్యులు భుజం వరకు తొలగించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు హఠాత్తుగా మంచం మీద పడటంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటివరకు చికిత్స కోసం ఐదు లక్షల వరకు ఖర్చు చేశారు. ఇక వైద్యం చేయించే స్తోమత తమకు లేదని... దాతలు ముందుకు వచ్చి సాయం అందించాలని వేడుకుంటున్నారు. తోటి పిల్లలు ఆడుకుంటుంటే... తాను మాత్రం ఇంట్లో ఉండడం బాధగా ఉందని చంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద చెత్తకుప్ప పోయడం వల్లే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. చెత్తకుప్పను తొలగించాలని చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా విద్యుత్ అధికారులు కన్నెత్తి చూడటం లేదని తెలిపారు. తమ కుటుంబానికి ఆస్తులేమీ లేవని.... తమ ఆర్థిక పరిస్థితిని చూసి... ఆపన్న హస్తం అందించాలని కోరుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం

బంధువులు, గ్రామస్థుల సహాయంతో ఇప్పటివరకు వైద్యం అందించారు. కానీ పూర్తి స్థాయి వైద్యం చేయించడానికి దాతలు సహకరించాలని వేడుకుంటున్నారు. రాబోయే వేసవి కాలంలో... కాలిన గాయాలు మరింత ఇన్‌ఫెక్షన్‌కు గురవుతాయని... మెరుగైన చికిత్సకోసం ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇళ్ల మధ్యలో ఎలాంటి సంరక్షణ చర్యలు పాటించకుండా ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసి... ప్రజల జీవితాలతో అధికారులు ఆటలాడుతున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. ఘటన జరిగి నెలరోజులు గడుస్తున్నా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఆర్టీసీ చరిత్రలో ఇదో కలికితురాయి: మంత్రి పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.