జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సిద్దిపేట జిల్లా చేర్యాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలు లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే సగానికి పైగా సభ్యత్వాలు నమోదు అయ్యాయని, ఇంకా ఇరవై వేల సభ్యత్వాల నమోదుకు బుక్స్ అవసరమని తెలిపారు. ప్రతి ఇంటిపై గులాబీ జెండా ఎగురవేయాలని, సభ్యత్వ నమోదుకు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త తమ వంతు బాధ్యతగా పాల్గొనాలన్నారు.
ఇవీ చూడండి: భాజపా ఎంపీలను మందలించిన మోదీ