ETV Bharat / state

విద్యుత్​ సబ్​స్టేషన్​ను ప్రారంభించిన మంత్రి హరీష్​రావు - siddipet district news

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్​ మండలంలో మంత్రి హరీష్​రావు పర్యటించారు. మాచిన్​పల్లిలో 33/11కేవీ విద్యుత్​ సబ్​స్టేషన్​ను ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన భూమిపూజ చేశారు.

Minister Harish Rao inaugurated the power substation in siddipet district
విద్యుత్​ సబ్​స్టేషన్​ను ప్రారంభించిన మంత్రి హరీష్​రావు
author img

By

Published : Sep 15, 2020, 9:56 PM IST

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, జడ్పీ ఛైర్మన్ రోజా శర్మ పర్యటించారు. మండలంలోని మాచిన్​పల్లిలో 33/11 కేవీ విద్యుత్ సబ్​స్టేషన్​ను ప్రారంభించారు. శేరిపల్లి బందారంలో ఒక కోటి ఇరవై లక్షలతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. మల్లేశం పల్లిలో ఒక కోటి పది లక్షలతో డబుల్​ బెడ్​రూం ఇండ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా భాజపాపై మంత్రి హరీష్​రావు ధ్వజమెత్తారు. దుబ్బాకలో ఓటు అడగాలంటే పార్లమెంట్​లో ప్రవేశపెట్టిన విద్యుత్​ బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాతనే రైతులకు కొద్దిగా గౌరవం వచ్చిందని మంత్రి అన్నారు. అన్నదాతలకు ఎకరానికి రైతుబంధు కింద ఐదు వేల రూపాయలు ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: ఇళ్లు కట్టుకునే పేదలకు టీఎస్​బీపాస్ బ్రహ్మాస్త్రం: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.