కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు వర్తక సంఘ సభ్యులు తమ వ్యాపారాలను స్వయం నియంత్రించుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు షిఫ్టుల్లో వ్యాపారాలను నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కిరాణా దుకాణాలు తెరిచేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. 1 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఇతర దుకాణాలు తెరవాలని నిర్ణయించారు.
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి... దీన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈరోజు నుంచి షిఫ్ట్ ల విధానంలో దుకాణాలు తెరవనున్నారు.