సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధి రామచంద్రపురం పోలీసులు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నీలోఫర్ మెటర్నిటీ ఆసుపత్రుల నుంచి వైద్యులు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అమర వీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని ఇప్పటివరకు చాలా పోలీస్ స్టేషన్లలో పరిధిలో నిర్వహించారని... చివరగా రక్తదాన శిబిరాన్ని రామచంద్రాపురంలో నిర్వహిస్తున్నట్లు సీఐ జగదీష్ తెలిపారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం అందిస్తున్నారని చెప్పారు.
- ఇదీ చదవండి: తపాలా సొమ్ము ఏ బ్యాంకుకైనా బదిలీ: సీపీఎంజీ