రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన గుంజె శ్రీనివాస్, పద్మ దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. రెండేళ్ల క్రితం శ్రీనివాస్ గుండెపోటుతో మరణించారు. రెండు నెలల క్రితం కామెర్ల వ్యాధితో పద్మ మృతి చెందింది. తల్లిదండ్రుల మృతితో ముగ్గురు చిన్నారులు సంతోష్, శశి, మధుప్రియ అనాథలుగా మారారు. వారిని అమ్మమ్మ పోషిస్తోంది. ఈ పిల్లలకు ఉండడానికి ఇళ్లు కూడా లేదు.
ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో చిన్నారులకు పోలీసులు గృహాన్ని నిర్మించారు. శుక్రవారం ముగ్గురు చిన్నారులు గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్పీ రాహుల్ హెగ్డే హాజరయ్యారు. పోలీసుల సాయాన్ని గ్రామస్థులతో పాటు జిల్లా వాసులు కొనియాడుతున్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్, రుద్రంగి, చందుర్తి ఎస్సైలు వెంకటేశ్వర్లు, సునీల్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'కరోనా ప్రభావంతో మరణాలు ఏ దశలోనైనా ఉండవచ్చు'