ETV Bharat / state

గతంలో మాదిరి ఈ ప్రశ్నాపత్రాల లీకేజీల్లో ప్రభుత్వ పెద్దలు ఉండొచ్చు: రేవంత్​రెడ్డి - టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజ్​లో రేవంత్ రెడ్డి విమర్శ

Revanth Reddy Criticizes TSPSC Paper Leakage: టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ విషయంలో పెద్దల హస్తం ఉందన్న అనుమానం రేకెత్తుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. గతంలో సింగరేణి, ఎంసెట్ పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లే.. ఈ పేపర్ లీకేజీలోనూ ప్రభుత్వ పెద్దలు ఉన్నారని భావిస్తున్నామన్నారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు.

pcc chief revanth reddy
pcc chief revanth reddy
author img

By

Published : Mar 14, 2023, 8:04 PM IST

Revanth Reddy Criticizes TSPSC Paper Leakage: టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల లక్షలాది నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతుంటే.. ప్రభుత్వం​ ఇప్పటివరకు స్పందించకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా ఉందని పీసీసీ అధ్యక్షుడు విమర్శించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా మోపాల్​లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజ్​లో ప్రభుత్వం రోజుకో మాట చెప్పుతుందని.. మొదట ప్రశ్నాపత్రం హ్యాక్ అయ్యిందని.. ఆ తర్వాత హనీ ట్రాప్​కు గురైందని.. ఇప్పుడు తాజాగా లీకేజ్ అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయని రేవంత్​ రెడ్డి అన్నారు. దీనిపై సీఎం కేసీఆర్​ గురించి కానీ, అధికారుల గురించి కానీ, టీఎస్​పీఎస్సీ ఛైర్మన్ వద్ద నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇంత విషయం జరుగుతుంటే ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. గతంలోనూ సింగరేణి, ఎంసెట్ పేపర్​లు లీకేజీల్లోనూ ప్రభుత్వ పెద్దలకు సంబంధం ఉన్నవారే ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దల హస్తం ఉందనిపిస్తోందని అన్నారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం పెద్దలను కాపాడేందుకు ఫిర్యాదు చేయడం లేదని రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ విషయంలో కనీసం పోలీసులైనా సుమోటోగా తీసుకొని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ పరీక్ష పారదర్శకంగా నిర్వహించలేకపోయారని.. ఇది కచ్చితంగా కేసీఆర్, ప్రభుత్వం వైఫల్యమేనని స్పష్టం చేశారు. గతంలో జరిగిన సింగరేణి, జేఎల్​ఎం, ఎంసెట్ వ్యవహారంలోనూ ప్రభుత్వం సమగ్ర విచారణ చేయలేదని ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు ఎనిమిదేళ్లుగా నియామకాలు చేపట్టలేదని విమర్శించారు. గ్రూప్​ 1 పరీక్ష కూడా లీకైందనే అనుమానం వ్యక్తమవుతుందని.. వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

"గత ఏడాది ఫలితాలు వచ్చిన గ్రూప్​ 1 పరీక్షను రెండు లక్షల 85వేల మంది విద్యార్థులు రాశారు. ఈ పరీక్షలో పేపర్ లీకేజ్​లో ప్రధాన నిందితుడు ప్రవీణ్​కు 150 మార్కులకు గానూ.. 103 మార్కులు వచ్చాయి. ఈ గ్రూప్​ 1 పరీక్ష పేపర్ కూడా లీకైందనే అనుమానాలు వస్తున్నాయి. వెంటనే ఈ విషయంపై సమగ్ర దర్యాప్తును జరిపించాలి. మొదట టౌన్​ ప్లానింగ్ పరీక్ష పేపర్​ లీకైంది ఆ పరీక్ష వాయిదా వేస్తున్నాము. వందల మంది విద్యార్థులు ఈ విషయంపై ఆందోళనలు చేస్తున్నాయి." - రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

గతంలో మాదిరి ఈ ప్రశ్నాపత్రాల లీకేజీల్లో ప్రభుత్వ పెద్దలు ఉండవచ్చు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.