నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మహారుద్రయాగం జరుగుతోంది. ఇవాళ నుంచి మూడు రోజుల పాటు యాగం నిర్వహింస్తామని నిర్వాహకులు తెలిపారు. యాగంలో రోజుకు వందకు పైగా జంటలు పాల్గొంటున్నారు. 40 మందికి పైగా వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య ఈ క్రతువు నిర్వహిస్తున్నారు. కార్తిక పౌర్ణమి పురష్కరించుకుని పార్థీవ లింగాన్ని తయారి చేయించి యాగశాల వద్ద ప్రతిష్ఠించారు. యాగం వల్ల మోక్షం కలుగుతుందని, వాతావరణం శుద్ధి అవుతుందని పండితులు వివరించారు. బాల్కొండతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి యాగంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'ఏడు సార్లు గెలిపించినందుకు ధన్యవాదాలు'